Sunday, 28 June 2015

ఇరువురు పండితులు

Chinnapillala Kathalu








ఒక గ్రామము లో నున్న పండితుని యింటికి దోఎఅముగా నున్న యింకొక గ్రామము నుండి యింకొక పండితుడు వస్తున్నానని కబురు చేశాడు అతనిని ఎదుర్కొని తీసుకొని రావటానికి ఎడ్ల బండి కట్టుకొని తన వూరి పొలిమేర కు
వెళ్ళాడు ఆ పండితుని తన బండి ఎక్కించుకొని తన యింటికి బయల్దేరాడు దాదాపు2 మైళ్ళు వెళ్ళాలి దారి  గతుకులుగా వుంది బండి కుదుపులు ఎక్కువగా వున్నాయి.

పొరుగూరి పండితుడు అబ్బబ్బ వెధవ బండి అన్నాడు అప్పుడు యజమాని యైన పండితుడు అయ్యా తమరన్నది కర్మధారయమా లేక షష్టీ తత్పురుషమా అన్నాడు కర్మధార య మైతే వెధవ యైన బండి అంటే బండి వెధవదిఅవుతుంది.,షష్టీ తత్పురుష మైతే వెధవ యొక్క బండి అంటే యజమాని వెధవ అవుతాడు.

అప్పుడు పొరుగూరు పండితుడు నవ్వుతూ ఆ రెండూ కాదు లెండి చతుర్థీ తత్పురుషము అన్నాడు అంటే వెధవ కొరకు బండి (అంటే తనే వెధవ అని) యిద్దరూ పెద్దగా నవ్వుకున్నారు అప్పటి పండితులకు భేషజాలు లేవు అన్నీ తేలికగా, తమాషాగా తీసుకునే వారని ఈ కథ మనకు తెలియ జేస్తుంది అన్నిటికీ తప్పు పట్టి దెబ్బలాడ కుండా వుంటే జీవితము ఆనందంగా సాఫీగా సాగిపోతుంది యిప్పటి వాళ్లకు అంత సంయమనము లేదు కదా....

No comments:

Post a Comment