Friday, 19 June 2015

సరదా కథ - బుడంకాయ బుడ్డోడు..

Chinnapillala Kathalu
అనగనగా ఒక ఊరిలో బుడంకాయంత బుడ్డోడున్నాడు, ఆ బుడంకాయంత బుడ్డోడికి ఒక రోజు వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంటే దోసకాయంత దొంగోడు చూస్తాడు, ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి తాటికాయంత తాళం పగలగొట్టి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలమ్మ చూసి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకొని లవంగం అంత లాఠి పట్టుకొని వచ్చి ఆ దొంగని పట్టుకొని, కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు, అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలమ్మ కి బంగాళ దుంప అంత బహుమానం ఇచ్చాడంట.

No comments:

Post a Comment