Monday, 29 June 2015

దేవీపురం జమీందారు








దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

ఏదీ మరో వజ్రం బయటకి తియ్‌ అంటూ జమీందారు గద్దించాడు ఆ దొంగ వణికి పోతూ నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు అంటూ దబాయించాడు ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది జమీందారు సంగతంతా గ్రహించి, ఇద్దరూ దొంగలే చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా ఇది అన్యాయం 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా అని ఎదిరించాడు జమీందారు ఒక్క క్షణం ఆలోచించి సరే నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను అంటూ దొంగవైపు తిరిగి నువ్వు ఎన్ని దొంగిలించావు అని అడిగాడు, తొంభై తొమ్మిది అన్నాడు దొంగ, అయితే నీకు 99 కొరడా దెబ్బలు అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు అని అడిగాడు, వందోది అన్నాడు మల్లన్న అయితే వందో దెబ్బ నీకు అన్నాడు జమీందారు అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే ఆ వందోది నాకు వేసేయండి అన్నాడు జమీందారు నవ్వి వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

No comments:

Post a Comment