Monday, 29 June 2015

దేవీపురం జమీందారు








దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

ఏదీ మరో వజ్రం బయటకి తియ్‌ అంటూ జమీందారు గద్దించాడు ఆ దొంగ వణికి పోతూ నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు అంటూ దబాయించాడు ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది జమీందారు సంగతంతా గ్రహించి, ఇద్దరూ దొంగలే చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా ఇది అన్యాయం 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా అని ఎదిరించాడు జమీందారు ఒక్క క్షణం ఆలోచించి సరే నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను అంటూ దొంగవైపు తిరిగి నువ్వు ఎన్ని దొంగిలించావు అని అడిగాడు, తొంభై తొమ్మిది అన్నాడు దొంగ, అయితే నీకు 99 కొరడా దెబ్బలు అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు అని అడిగాడు, వందోది అన్నాడు మల్లన్న అయితే వందో దెబ్బ నీకు అన్నాడు జమీందారు అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే ఆ వందోది నాకు వేసేయండి అన్నాడు జమీందారు నవ్వి వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

భారతంలో ఒక కథ- "శిఖండి"

Chinnapillala Kathalu





కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకుని ఆ స్వయంవరానికి విచ్చేసాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి అపుడు భీష్ముడు అందరిని ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమన్నాడు అపుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి గాంగేయా నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది అతనే నా ప్రాణనాయకుడు మనసు లేని మనువు క్షేమం కాదు.

నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు, నా చెల్లెల్లిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లిచేయ్యి అని వేడుకుంది భీష్ముడు సరేనని అంబని సాళ్వదేశానికి పంపాడు  సాళ్వుడు అంబని చేసుకోడానికి నిరాకరించాడు నువ్వంటే ఇష్టం ఉన్న, వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు తిరిగి హస్తిన కొచ్చిన అంబని భీష్ముడు కూడా నిరాకరించాడు.

అపుడు అంబ నీ వలననే నా ఆశలన్ని నేలరాలాయి నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది అంబా నువ్వు ఏనాడూ ఐతే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అపుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు తన కూతురిబిడ్డ ఐన అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు ఇదే నీకు చేయగల సహాయం అని చెప్పాడు.

ఆ వరమాల ధరించే వారికోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకుంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనక పోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి, ఆత్మాహుతి చేసుకుంది. ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా అంబ జన్మించింది అంబ
అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది.

అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో భీష్ముడితో వైరమా అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళకొట్టాడు అంబ తన ప్రతిజ్ఞ నేరవేరడంకోసం శివుడికోసం తపస్సుచేసి పురుషుడిగా మారింది ఆ అంబనే శిఖండి. మహాభారత యుద్దంలో అర్జునుడిరథం ముందుభాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు ఆ విధంగా అంబ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది.

ఒక పొట్టి పిచిక






అనగా అనగా వో వూర్లో ఒక పొట్టి పిచిక ఉండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవ గింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగుచేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది చేసుకుని, చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే, చీమ తలకాయంత రొట్టెముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ, వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి, చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పక పక నవ్వాడు. అప్పుడా పిచిక కెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారూ, రాజుగారూ, అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించు రాజా అంది.

రాజు కూడా నవ్వి,ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా, వీడి పని ఇలా ఉందా.... అని ఆ పిచిక వెంటనే లేళ్ళ దగ్గరికి వెళ్ళి, జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం అది పాడు చెయ్యండి లేళ్ళూ అంది. ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు.

అమ్మా వీటమ్మ కడుపు కాలా ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా అని ఆ పిచిక ఏం చేసిందీ, బోయవాడి దగ్గరికి వెళ్ళి, బోయాడూ, బోయాడూ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగి ని దండించమంటే రాజలా చెయ్యలేదు రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ళు పాడుచెయ్యలేదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టు బోయాడూ అంది. ఇదంతా విని బోయవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ళ కాళ్ళను విరక్కొట్టనా బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు అని పంపేసాడు.

దాంతో పిచ్చిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఎలకా, ఎలకా, ఓ సహాయం చేసి పెట్టాలి చీమ తలకాయంత రొట్టి చింత చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయవాడి చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలకా అంది ఎలక కూడా నా వల్ల కాదు పొ"మ్మని అంది.

అమ్మ దొంగ ముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లి బావా, పిల్లి బావా చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పటిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలుకను వేటాడు పిల్లీ అంది నాకిప్పుడు చాలా పనులున్నాయ్ ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది.

అయ్యో దీని దర్జా మండా ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, అవ్వా అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అవ్వా అంది. చీమ తలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానూ చాలు చాల్లే అని అవ్వ కసిరి పొమ్మంది.

ఏమి తూలిపోతున్నావే మామ్మా అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు అవ్వను చితక్కొట్టు తాతా" అంది.

అమ్మో నేనలా చేస్తానా చెయ్యను పో అన్నాడు తాత ఓహో నీకింత గర్వమా సరే అని ఆ పిచికేం చేసిందీ, గబ గబా ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు పిన్నీ, ఆవు పిన్నీ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలొ పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటె బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడి పాలొయ్యలేదు, తాత అవ్వను చితక్కొట్టలేదు తాత పాలు తియ్యడానికొచ్చినప్పుడు ఫెడీ మని తన్ను ఆవూ అంది.

అబ్బే, నేనలా చెయ్యను సుమా అంది ఆవు అప్పుడు పిచిక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఒక ఈగ ఆ దారమ్మట వెడుతూ ఏం పిచికా ఏడుస్తున్నావు అనడిగింది పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరీ చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని చితక కొట్టాడు. అవ్వకు వొళ్ళు మండి, పిల్లి మీద వేడి పాలోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ళ కాళ్ళను విరక్కొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజు గారి తోటను పాడు చేసాయి. రాజుకి బుధ్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు, చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టి ముక్కనూ తీసి పిచిక చేతిలొ పెట్టాడు. పిచిక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.

Sunday, 28 June 2015

సింహం-నక్క-ఎలుగుబంటి

Chinnapillala Kathalu




























సింహం-నక్క-ఎలుగుబంటి దీనిలాంటి కథే ఒకటి స్కాంద పురాణంలో ఉంది ఇది చదివాక, మంచి-చెడు, ధర్మం-అధర్మం గురించిన ఆలోచనలు రేకెత్తించే అద్భుతమైన ఆ కథ ను కూడా చదివి చూడండి.

గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక నక్క - ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి నక్క ముసలిది సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు ఎలుగుబంటిది మంచి మనసు తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకూ కొంచెం పెట్టేది అది, ఒకనాడు నక్క , ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో మిత్రమా, నక్కా..... నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు.

ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది మన వైపే వస్తోంది దానికి చిక్కామంటే అంతే అందుకని నువ్వు నా వీపును కరచుకో నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను అన్నది. ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి - నక్క కదలక మెదలక ఉండగా చెట్టుకింద సింహం వాటివైపే చూస్తూ కూర్చున్నది ఎలుగు - నక్క చెట్టు దిగలేదు సింహం ఎంతకీ పక్కకు కదలలేదు.

ఇంక కుదరదు అనుకున్న ఎలుగుబంటి, చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి, పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటుచేసింది చీకటిపడ్డాక అది నక్కతో మిత్రమా.... సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో‌ మనం‌ ఉండాలి మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి అన్నది నక్క సరేనన్నది. అప్పుడు ఎలుగుబంటి వయసు పైబడ్డ దానివి ముందు నువ్వు నిద్రపో అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను నువ్వు కాపలా కాద్దువు అని నక్కతో అన్నది నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.

చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది ఓ మిత్రమా, ఎలుగు బంటీ నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు అయినా నా మాట విను నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను అట్లా నా ఆకలీ తీరుతుంది నీకు ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది అని ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది చూడు, సింహరాజా ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు.

నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను అది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు "ఏ జీవికీ నిద్రాభంగం కలిగించకూడదు అది మహా పాపం" నిద్రలోనే కదా, అన్ని ప్రాణులూ బడలికను పోగొట్టుకొని హాయినీ, సుఖాన్నీ పొందేది నేను దీన్ని మోసం చేయటం అసంభవం ఎన్ని రోజులైనా సరే నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను అని అంతలోనే రాత్రి మూడవ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది.

కొంత సేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది నక్కబావా నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో గదా ఈ ఎలుగుబంటి తను తినదు నిన్ను తిననివ్వదు నాకు తెలుసు. నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను నువ్వూ తినొచ్చు మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు తెలివైనదానివి ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ ఎలుగును తోసెయ్యి అన్నది, నక్కను ప్రలోభ పెడుతూ.

నక్క కాసేపు ఆలోచించి- ఎలుగుబంటిని కిందికి తోసేసింది.

కిందపడ్డ ఎలుగు దగ్గరకొచ్చి నిలబడి, సింహం ఎగతాళిగా నవ్వుతూ ఎలుగుబంటీ, చూశావా ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోసెయ్యకపోతివే అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది చూస్తివా, నక్క తెలివి అన్నది. ఎలుగుబంటి విచారంగా నవ్వి, సింహరాజా ఆ ముసలినక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను ఎందుకంటే నామీద నాకు విశ్వాసం ఉంది నేను కౄరజంతువునే కానీ ఏ ప్రాణికీ కావాలని హాని తలపెట్టను నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు అనేది నా విశ్వాసం.

నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని, నీ ఆకలి తీర్చుకుంటావు నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే కానీ నక్క... దానంతట అది క్రిందికి దిగలేదు మరి చెట్టు మీద దానికి ఆహారమూ దొరకదు చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది లేదా చెట్టు మీది నుండి క్రిందపడి ఎముకలు విరిగి చస్తుంది ఇది సత్యం.

ఇక ఈ నక్క తెలివైనది కాదు అనేది స్పష్టం దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు నిజానికి నక్క తిక్కది అందుకనే ముందుచూపు లేక, ఈ పనికి ఒడి గట్టింది అన్నది ఎలుగుబంటి, ధైర్యంగా నేను నిన్ను తినకుండా వదిలేస్తాను మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా అంది సింహం అలా చేయను ఎందుకంటే, మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు అని దీని ద్వారా అందరికీ తెలియాలి అన్నది ఎలుగు బంటు.

ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకు మంచిది కాదు నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే నీ దారిన నువ్వు పో అని బయలుదేరింది సింహం ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళింది ,నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది.

చిన్నపిల్లల కథలు

Chinnapilla Kathalu








ఒకసారి సనకసనందనులు అనే నల్గురు ఋషులు విష్ణువును దర్శించ టానికి వైకుంట మునకు పోతారు అక్కడ జయ,విజయులనేడి ద్వార పాలకులు వారిని లోనికి పోవడానికి అనుమతించరు వారు ఎన్ని విధాల చెప్పి చూసినా వారు లోనికి అనుంతించరు అప్ప ుడు వారికి కోపం వచ్చి మీరు భూలోకంలో మానవులుగా పుట్టుదురు గాక అని శాపం యిస్తారు అప్పుడే విష్ణువు బయటికి వచ్చి ఆ ఋషులను క్షమించ మని వేడి జయ విజయులను మందలిస్తాడు.

వారిచ్చిన శాపమును గురించి విని విష్ణువు జయవిజయుల తో యిలా చెప్తాడు మీరు భూలోకం లో మంచి వారుగా పుట్టి ఏడు జన్మల తర్వాత నన్ను చేరుకుంటారా లేక రాక్షసులై పుట్టి నన్ను ద్వేషిస్తూ మూడు జన్మల లో నా చేత
చంప బడి నన్ను చేరుకుంటారా మీకేది యిష్ట  మో చెప్పండి అప్పుడు వారు స్వామీ మీకు దూరంగా ఏడు జన్మలు
వుండలేము రాక్షసులుగా పుట్టి మూడు జన్మ లలో మీ చేత చంపబడి మిమ్ములను చేరుకోవడమే మాకు యిష్టము అని చెప్తారు.

వారిద్దరూ మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా పుట్టి లోక కంటకులై అందరినీ బాధ పెడుతుంటారు.వరాహావతారము లో హిరణ్యాక్షుడినీ,నరసింహావతారం లో హిరణ్యకశిపు డినీ విష్ణువు సంహరిస్తాడు
రెండవ జన్మ లో రావణ,కుంభకర్ణులు గా పుట్టి లోక కంటకు లై చరిస్తూ వుంటారు అప్పుడు విష్ణువు శ్రీరాముడు గా పుట్టి వారిని సంహరిస్తాడు మూడవ జన్మ లో శిశుపాల, దంతావ క్త్రు లుగా పుడతారు.విష్ణువు శ్రీ కృష్ణుడు గా అవతరించి వారిద్దరినీ సంహరిస్తాడు శిశుపాలుడిని వంద తప్పుల వరకూ క్షమించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగం లో శిశు పాలుడిని తన చక్రము తో సంహరిస్తాడు.

అప్ పుడే శిశుపాలుడి ఆత్మ ఆయనలో లీన మవుతుంది యిక దంతవక్త్రుడు వృద్ధ శర్ముకు,శ్రుత దేవకు పుట్టిన కొడుకు శ్రుతదేవ వసుదేవుడి చెల్లెలు శిశుపాలుడు యితడి అన్న ఇతను కరూష దేశానికి అధిపతి తన మిత్రులైన పౌండ్రక వాసుదేవాదులనుశ్రీకృష్ణుడు చంపడం వల్ల కృష్ణుడి మీద పగ పెంచుకుంటాడు తన మిత్రులకు ఉత్తర క్రియలు జరిపిస్తూ వుంటే అక్కడ కృష్ణుడిని చూసి అతనితో యుద్ధము చేసి కృష్ణుడి చేతిలో మరణిస్తాడు అతని తేజస్సు కృష్ణుడి లో ఐక్య మవుతుంది అలాగ జయ,విజయులు తిరిగి విష్ణువును చేరుకుంటారు.

కవితాయ స్వాహా








విజయనగర సామ్రాజ్యం లోని ఒక వూరిలో అక్కిసెట్టి అనే ఒక కోమటి వుండేవాడట అతను గుగ్గిళ్ళు చేసి అమ్ముతూ వుండే వాడట అతనికి తెనాలి రామకృష్ణుడు అన్ని పద్యాలు చెప్తాడు కదా నేనూ కవిత్వం వ్రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది రామకృష్ణుడు దగ్గరికి వెళ్లి కవిత్వం వ్రాయడానికి చిట్కా లేమైనా చెప్పమని అడిగాడు.

రామకృష్ణుడు నీకు ఈ కవిత్వం వ్రాయాలనే పిచ్చి ఎందుకు అందరికీ కవిత్వం పట్టుబడదు హాయిగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ బ్రతుకు అని నచ్చ చెప్పాడు కానీ ఆ కోమటి కాదుకూడదు మీరు నాకు చిట్కాలు చెప్పాల్సిందే అని పట్టు బట్టాడు అప్పుడు రామకృష్ణుడు సరే అయితే పున్నమి రాత్రి వెళ్లి ఏదైనా మంచి తోటలో చెట్టుక్రింద కూచుని ఆలోచిస్త్తూ వుండు ఏదైనా స్ఫురించ వచ్చు అని చెప్పి పంపించాడు.

సరే నని ఆ అక్కిసెట్టి పున్నమ నాటి రాత్రి ఒక తోటలో కూర్చుని ఆలోచిస్తున్నాడట అలా చంద్రుడిని చూస్తూ వుంటే అతనికేదో స్ఫురించింది వెంటనే వ్రాసుకున్నాడు పున్నమి వెన్నెల కాసెగా అది చాలా బాగుంది అని పించింది సెట్టికి యింక ఉత్సాహం వచ్చేసింది ఒక పాదం వచ్చింది కదా అని ఆలోచిస్తూ వుంటే ఒక కోయిల కుహూ కుహూ అని కూసింది.

వెంటనే అతనికి యింకో పాదం స్ఫురించింది పోనాపై కోయిల కూసెగా చాలా బాగుంది అనుకున్నాడు యింక యెంత ఆలోచించినా మూడో పాదం రాలేదు అప్పటికే అర్ధరాత్రి అయి పోయింది యింక యివ్వాల్టికి చాలని యింటికి వెళ్లి పోయాడు యింటికి వెళ్ళగానే చూస్తే ఎప్పుడో ప్రొద్దున చేసిన గుగ్గిళ్ళు అన్నీ పాసిపోయాయి.

ఆ దినం ఆదాయం కూడా పోయింది అయిన అతనికి వెంటనే యింకో పాదం స్ఫురించింది అంగట్లో గుగ్గిళ్ళు పాసేగా
అదీ వ్రాసుకున్నాడు.నాలుగో పాదం యెంత ఆలోచించినా రాలేదు యింక రేపు చూసుకోవచ్చు లే అని పడుకున్నాడు ప్రోద్దునలేచి యెంత ప్రయత్నించినా నాలుగో పాదం రాలేదు సరే అనుకోని రామకృషుని దగ్గరకు వెళ్లి మూడు పాదాలూ వినిపించాడు.నాలుగో పాదం చెప్పమని బ్రతిమలాడాడు.

పున్నమి వెన్నెల కాసెగా పొన్న పై కోయిల కూసెగా అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా రామకృష్ణుడు వెంటనే 4వ పాదం అక్కి శెట్టి ముండ మోసెగా అంటే వ్యాపారం జరుగక అక్కిసెట్టి నష్ట పోయాడు అని దాని అర్థం  నేను చెప్పాను కదా కవిత్వము అందరికీ రాదు అనీ వెళ్లి చక్కగా వ్యాపారం చేసుకో అని బుద్ధి చెప్పి పంపించేశాడు అక్కిసెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ బ్రతికేసాడు.ఈ కథ మీ పిల్లలకు చెప్పండి నవ్వుకోడానికి బాగుంటుంది.

నా స్వీయానుభవం కుక్క చెప్పిన కథ

Chinnapillala Kathalu








రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు వాడికి నా అనేవాళ్లెవరూ లేరు గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు ఆయనకో చిన్న కొడుకున్నాడు ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు ఆయన దగ్గరికెళ్లి ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది అడిగాడు గోపాల్‌ ఏమో నాకు తెలీదు అని చెప్పాడు అతను తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌ అడిగాడు వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే అని మనుసులో అనుకుని ఇవి గుర్రం గుడ్లు బాబూ కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు అని మనసులో అనుకుని దీని ధరెంత అడిగాడు గోపాల్‌ ఒక్క గుడ్డు యాభై రూపాయలు చెప్పాడతను గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌ ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

ఇరువురు పండితులు

Chinnapillala Kathalu








ఒక గ్రామము లో నున్న పండితుని యింటికి దోఎఅముగా నున్న యింకొక గ్రామము నుండి యింకొక పండితుడు వస్తున్నానని కబురు చేశాడు అతనిని ఎదుర్కొని తీసుకొని రావటానికి ఎడ్ల బండి కట్టుకొని తన వూరి పొలిమేర కు
వెళ్ళాడు ఆ పండితుని తన బండి ఎక్కించుకొని తన యింటికి బయల్దేరాడు దాదాపు2 మైళ్ళు వెళ్ళాలి దారి  గతుకులుగా వుంది బండి కుదుపులు ఎక్కువగా వున్నాయి.

పొరుగూరి పండితుడు అబ్బబ్బ వెధవ బండి అన్నాడు అప్పుడు యజమాని యైన పండితుడు అయ్యా తమరన్నది కర్మధారయమా లేక షష్టీ తత్పురుషమా అన్నాడు కర్మధార య మైతే వెధవ యైన బండి అంటే బండి వెధవదిఅవుతుంది.,షష్టీ తత్పురుష మైతే వెధవ యొక్క బండి అంటే యజమాని వెధవ అవుతాడు.

అప్పుడు పొరుగూరు పండితుడు నవ్వుతూ ఆ రెండూ కాదు లెండి చతుర్థీ తత్పురుషము అన్నాడు అంటే వెధవ కొరకు బండి (అంటే తనే వెధవ అని) యిద్దరూ పెద్దగా నవ్వుకున్నారు అప్పటి పండితులకు భేషజాలు లేవు అన్నీ తేలికగా, తమాషాగా తీసుకునే వారని ఈ కథ మనకు తెలియ జేస్తుంది అన్నిటికీ తప్పు పట్టి దెబ్బలాడ కుండా వుంటే జీవితము ఆనందంగా సాఫీగా సాగిపోతుంది యిప్పటి వాళ్లకు అంత సంయమనము లేదు కదా....

భగవత్గీత ఆవిర్బావం

Chinnapillala Kathalu








భాగవతం కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశము నందు జరిగినది కురుక్షేత్రం ఈనాటి
భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.

కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రధసారధి శ్రీకృష్ణుడు రధాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు.

అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు వారిని చూసి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు.

అలా అర్జునునికి అతని రథసారధి శ్రీకృష్ణునికి  మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

సచ్చిదానంద స్వామి

Chinnapillala Kathalu






సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ వూరూరా తిరుగుతుండేవాడు ప్రజలిచ్చే దక్షిణను ఖర్చుల కోసం స్వీకరించేవాడు కొంత కాలానికి ఆయన దగ్గర ఒక మూట నిండా కాసులు సమకూరాయి దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు.

అది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు ఓసారి వినయంగా స్వామి వారిని కలిసి, నేనొక అనాధను నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను అంటూ అభ్యర్థించాడు స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలెను తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు.

ప్రతి రోజూ గురుశిష్యులు వూరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు ఎవరి జోలెను వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు నాలుగు రోజులు గడిచాక స్వామిజీ గాఢ నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూట కోసం శిష్యుడు వెదికాడు అది కనిపించలేదు నెమ్మదిగా ఆయన జోలె తీసి చూశాడు అందులోనూ లేదు గురువు గట్టోడే కాసుల మూటను ఎక్కడో దాచాడు అనుకున్నాడు శిష్యుడు మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యధావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు.

ఆ రాత్రి కూడా వాడు వెతికి చూశాడు కానీ ఎక్కడా మూట కనిపించలేదు మరో నాలుగు రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది గురువుగారి దగ్గరకు వెళ్లి, స్వామీ ఈ సంచార జీవితం మొహం మొత్తింది ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను సెలవిప్పించండి అన్నాడు తప్పకుండా పోయిరా నాయనా ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు అన్నారు సచ్చిదానంద స్వామి.

వెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి గురువుగారూ నాదొక చిన్న సందేహం పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూట రాత్రి వేళ కనిపించదేం ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు సచ్చిదానంద స్వామి నవ్వి, నాయనా నీ వాలకాన్ని మొదటి రోజే గ్రహించాను.

రోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి ఇతరులది దోచుకోవాలనుకునే వాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్యా అన్నారు శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు.

బాగు కోరేదే భాగవతం






శ్రీకృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయ మూర్తియనీ, బ్రహ్మ సూత్రాలకు భాష్యరూపమనీ, సకల వేదసారమనీ, కామక్రోధాలను జయించడానికి, ధుఃఖ దారిద్య్ర, పాపములను ప్రక్షాళన కావించుటకు, భాగవతానికి మించిన ఔషదము వేరొకటిలేదనీ, కాశి, గంగ, ప్రయాగ, గయ, తీర్ధ సేవనము, భాగవత కధా శ్రవణానికి సాటిరావనీ, ఎక్కడభాగవత కథా శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని.

వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మా్తమ్రుననే శ్రీ మహావిషూ్ణవు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది.

ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వసా్తల్రను ఎందుకని అపహరించాడు బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత
శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు, కంసుడు,
జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడ చేపట్టుకోనని ఎందుకు అన్నాడు.

గోపికలతో రాసకడ్రలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడనికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏవిధంగా ఆమోదింపబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు. ఆటలాడాడు, పాటలూ పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటెవాడనీ అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు. పెద్దవాడై దొరగా రాజ్యపాలనా చేశాడు.

రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలనూ నడిపించాడు రాయబారం చేశాడు రధాన్ని నడిపాడు రాసకడ్రలు సలిపాడు గురుసేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడుమహారాజులచే పాదపూజలందుకున్నాడు శత్రువులను సం హరించాడు చివరకు క్షవర కర్మ కూడ (రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గొరిగాడు) చేశాడు ఆర్తులను ఆదరించి సేదతీర్చాడు ఆపదలోఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందలను మోసాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు.

సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతికెక్కాడు ఆనందరూపుడై ఆబాలగోపాలాన్నీ అలరించాడు మధుర మూర్తియై ప్రేమామృతాన్ని వెదజల్లాడు ఙ్ఞాన స్వరూపుడై ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీ కృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను మహాత్మా్యన్ని స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజూ పఠించాలి ఎంతగా పఠిస్తే, అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి.

భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు  సూచిస్తున్నారు.

ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు

Chinnapillala Kathalu








అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు, అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టేవరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టిపిచిక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది.

ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది కోపం వచ్చింది ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు. పాపం పొట్టిపిచ్చిక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా... చంకలో కూచునే పాట ఎత్తకుంది..

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ......

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.....

రెండుభమిడిలేళ్లు గూ, గూ, గూ.....

రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ.....

చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ....

నేను కూడా తినబోతే గూ, గూ, గూ....

పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ....

పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ.....

నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ.....

ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది చంక బాగా బిగించాడు ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ... ఊళ్లోకిపోతే దీనిపాటవిని అంతా నవ్వుతారు అందుకని ఊరిబయట ఉన్న శెట్టిగారి అరుగుమీద కూచున్నాడు.

మన పిచ్చిక నోరుమూస్తేగా పాడుతూనే ఉంది.

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ.. కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.... అని. దీనిపాటవిని శెట్టి బయటకి వచ్చి ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెండతండీ అన్నాడు బ్రాహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు ఇంతేనా... అన్నాడు శెట్టి కాదు అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు.

ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి ఇంత.....అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ...

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ...... అని పాడటం మొదలుపెట్టింది బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.

Wednesday, 24 June 2015

తెనాలి రామకృష్ణుడి తెలివి తేటలు జగత్ప్రసిద్ద మైనాయి.

Chinna Pillala Kathalu

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు అని వ్రాసి తన దూత తో పంపించాడు రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది.

దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది అంటే అతనికి ఒక ఉపాయం తట్టింది బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి వేశాడు నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా
అయింది.రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు పంపుతూ ఈ కుండను పగుల గోట్టకుండా తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు.

ఆ నవాబుకు కుండను పగుల గోట్టకుండా దాన్ని ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడ మేలాగో తెలీలేదు మీ రామకృష్ణుడిని పంపి తీసి యిమ్మని వ్రాసి పంపించాడు రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు ఆ కట్టి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి
నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా కోశాడు చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే బయటికి తీశాడు సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయారు.

నవాబు రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు.

డబ్బుకు లోకం దాసోహం

Chinna Pillala Kathalu








సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు పక్కపక్క పొలాలూనూ వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే.

అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా.

ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే మెరుపులా తప్పుకున్నాడు రంగా.

పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌ అన్నాడు రాజా చిరాకు పడుతూ నీ దగ్గర దాపరికమెందుకు నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నఅన్నాడు రంగా నిజాయితీగా ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా.

ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి వారితో కలిసి నడవసాగాడు రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌ అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, డబ్బుకు లోకం దాసోహం అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

గంగా పురాణం

Chinnapillala Kathalu








పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ వుండేది అదిదగ్గర వున్నా గ్రామాల్లోకి వెళ్లి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది ఆ పాపను చూస్తె దానికి చంపబుద్ధి కాలేదు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది అడవిలోని తేనే,పళ్ళు తినిపుంచి పెంచి పెద్ద చేసింది ఆ అమ్మాయికి యుక్తవయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చిఅతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు సగర చక్రవర్తిగా పుట్టింది.

సగరుడు ఒకసారి కొలువు తీరి వుండగా నారదుడు వచ్చి నీవు పూర్వజన్మ లో తోడేలువి ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేసావు ఆ పుణ్య ఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తి వై పుట్టావు అని చెప్తాడు అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే యింకా యెంత పుణ్యమో నని ఆలోచించి తనకు పదహారువేల కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మ దేవుడిని గురించి తపస్సు చేస్తున్నాడు సగరుడు పదహారువేల కన్యలకు తండ్రి యై వారందరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్య ఫలం వల్ల అతనికి యింద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించిఇంద్రుడు సరస్వతీ దేవిని ప్రార్థించి సగరుడు బ్రహం దేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై వుండి పదహారువేల పుత్రికలు అనే బదులు పుత్రులు అనేట్టుగా చేయమని కోరాడు.సరస్వతీ దేవి అలాగే చేసింది.

సగరుడు తన పొరపాటు గుర్తించే సరికి ఆఅలస్యమై పోయింది సగరుడికి 16000 వేల మంది పుత్రులు జన్మించారు వారంతా పెరిగి పెద్దవారిన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతె నేమి అశ్వమేధయాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. అశ్వమేధ యాగ సమయం లో ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళం లోని ఒక గుహలో దాస్తాడు అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు ఆయనకు ఒక వరముంది తన తపస్సు భగ్నం చేసిన వాళ్ళను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమై పోతారు.
సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్ళను పంపిస్తాడు.వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ వుందో కనుక్కోలేక తిరిగి వస్తారు సగరుడు తన పదహారు వేల మంది పుత్రులను పంపిస్తాడు అశ్వాన్ని వెదుకుతూ భూలోకం లో కనబడక పొతే పాతాళం లో వుంటుందేమో నని వారు భూమిని త్రవ్వుతూ పోతారు పెద్ద ఆఖాతము ఏర్పడుతుంది త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు అక్కడ కపిల ముని తపస్సు చేసుకుంటూ వుంటాడు అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టి వేయబడి వుంటుంది అది చూసి వాళ్ళు కోపోద్రిక్తు లై మునిని దూషిస్తూ ఓ..దొంగ  మునీ మా యాగాశ్వమును దొంగిలించి యిక్కడ దొంగ తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నావా అని గట్టిగా అరుస్తారు దీర్ఘ తపస్సులో వున్నకపిలుడు మాట్లాడడు వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు అప్పుడు కపిలుడికి తపో భంగ మై కళ్ళు తెరుస్తాడు ఆపదహారువేల మంది సగర పుత్రులు భస్మ మై బూడిదగా మారుతారు.

ఆ విషయము నారదుడి వల్ల తెలుసు కొని సగరుడు చాలా దుఖిస్తాడు వాళ్లకు పుణ్యలోకాలు కలుగాజేయాలనుకుం
టాడు నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాసి మీద పారేట్టుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగు తాయని చెప్తాడు సగరుడు వెయ్యేండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు.తరువాతి తరం వారు కూడా ప్రయత్నించి విఫలు లవుతారు సగరుడికి మూడో తరం వాడైన భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసి ఆమెను మెప్పిస్తాడు.

ఆమె నేను ఆకాశము నుండి క్రిందకు దూకితే ఆ వేగము భూమి ఓర్వలేదు నన్ను భరించే శక్తి పరమ శివుడికి మాత్రమే వుంది ఆయనను ప్రసన్నం చేసుకొని రా అని చెప్తుంది భగీరథుడు ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్ష మై గంగను నేను భరిస్తాను అంటాడు అప్పుడు గంగ ఆకాశము నుండి శివుని మీదకు దూకుతుంది శివుడు గంగను తన జటాజూటం లో బంధిస్తాడు భగీరథుని కోరిక మేరకు తన ఒక జటవిప్పుతాడు అందు లోనుంచి గంగ ఒక పాయగా భగీరథుని వెంట వస్తూ వుండగా జహ్నువు అనే రుషి ఆశ్రమము మీదుగా ప్రవహిస్తూ ఆ ఆశ్రమాన్ని ముంచి వేస్తుంటే జహ్ను ముని కోపం తో ఆమెను తనగొంతులో బంధిస్తాడు.భగీరథుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడిచి పెట్టమంటాడు.

ఆయన తన చెవి నుండి గంగను వదులు తాడు అందుకే గంగ కు జాహ్నవి అనే పేరు వచ్చింది గంగ భగీరధుడి వెంట వచ్చి ఆ భస్మ రాసుల మీదుగా ప్రవహిస్తుంది అప్పుడు సాగరపుత్రులకు ఉత్తమ లోకాలు సంప్రాప్త మవుతాయి భగీరథుడు క్రిందకు తెచ్చినాడు కాబట్టి గంగ భాగీరథి అయింది సగరపుత్రులు త్రవ్విన ఆఖాతాన్ని పూడ్చడానికి ఇంద్రుడు పెద్ద వర్షము కురిపించి ఆ ఆఖాతాన్ని నీటితో నింపి వేస్తాడు అదే యిప్పుడు మన సముద్రము సగర పుత్రుల చేత త్రవ్వబడినది కాబట్టి సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది.

మూడు రాళ్లు

ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అతడు బాగా వృద్ధుడు ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు , నాయనలారా.... నేను ఎంతోకాలం జీవించను ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేశాను ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా... అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి సత్యమూర్తి తెలివైనవాడు. 

నా వ్యాపారాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చినవాడు అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది అలా చేస్తామని నాకు మాటివ్వండి అన్నాడు అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు.

అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు తర్వాత ముగ్గురి వైపు తిరిగి, అబ్బాయిలూ... ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు ఏంటది...? అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను ముందు ఆ మూడు రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి.

ఓస్ అదేమంత పెద్ద విషయం కాదు మీ ముగ్గురు మూడురాళ్లను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్దకొడుకు అంతే కాదు మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు .

ఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది అలాగే మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు అందులో ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది.

చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.

ఈ తాళాలు నా ఒక్కడివి కావు మనందరివీ అని తన అన్నలిద్దర్నీ కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.

యముడి కొడుకు యమహా...........

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది, ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.

కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా, నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట అంటూ అదృశ్యమైపోయాడు తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.

ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, అమ్మా.... త్వరగా రా.. నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ అరిచాడు.

కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది.

Sunday, 21 June 2015

అద్దం లో మనిషి......

Chinnapillala Kathalu








చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆటను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు. వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.

ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు అతనే అందమే అతని అహంకారం ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు. ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు అతని దేగ్గిరకు వెళ్లి ఉపాయమదిగాదు ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు రోజు ఈ అద్దం చూసుకో నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. 

నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు అన్నాడు కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది అని హెచ్చరించాడు అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాన్కారిగా జీవితం కొనసాగాడు రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డ ఆటను చేసే పనులు, అతని నడవడిక మార్చుకోలేదు.కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.

ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.
ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.

కోతి ఉపవాసం








 ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది జపం చేయటానికి నిశ్చయించుకుంది.పని అంతా పూర్తి చేసుకుంది కూర్చొని జపం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి దానికొక సందేహం వచ్చింది ఈరోజంతాఉపవాసం ఉండి జపం చేస్తుంటే,రేపు నాకు చాలా నీరసంగా వుంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే  ఎలా ఏమీ చెయ్యలేనేమో .....

ఈ ఆలోచన వచ్చాక ,కోతి జపం చేయటం ఆపింది అప్పటికప్పుడు లేచి చెట్టూపుట్టా గాలించి మరుసనాటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది దానిని ఒక మూల భద్రపరచింది.మళ్ళీజపం కొనసాగించింది. మరికొంత సేపటికి కోతికి ఇంకో ఆలోచనవచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేక పోతేనో ఆహారం ముందేవుంచుకుని కూడా ఆకలితో అలమతించి పోతాను కాబోలు ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడి పోయింది వెంటనే లేచింది ఆహారాన్ని తన చేతికి అందుబాటులో వుంచుకుంది మళ్ళీ జపం ఆరంభించింది.

ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించి పోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేక పోతేనో అంటూ జరగబోయేది ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే వుంచుకుని ఉపవాసం చేయాలనుకుంది ఆవిధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలాచేస్తుంది.

చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోట్లో వుంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగూ అది నేను తినవలసినదేకదా అందువల్ల ఈఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని,సుఖం గా జపం చేసుకుంటాను అనుకుంది తనకు వచ్చిన ఈ గొప్ప అలోచనకు ఎంతగానో మురిసి పోయింది ఆహారం తీసుకుంది నిద్ర ముంచుకొచ్చింది స్వామీజీ ఉపన్యాసం మరచిపోయింది పక్క పరుచుకుంది హాయిగా నిదురపోయింది.

అంతా మన మంచికే.....

Chinna Pillala Kathalu
అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడ అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు.

కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది అనడిగాడు అప్పుడు మంత్రి నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు అందుకే ఏం జరిగినా "అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు.

Saturday, 20 June 2015

పేదరాశి పెద్దమ్మ కధ......




సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి ఒకరోజు రాజుగారి రెండో భార్య....మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి అని రాజుగారిని అడిగింది దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని చెప్పాయి అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని అన్నాయి అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చింది ఆమెని చూసిన రాజు ఆనంద పడి రెండో భార్యని వెళ్ళగొడతాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది అయ్యో.. ఇలా జరిగిందేంటి.. అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి..

ఇక కథ కంచికి... మనం ఇంటికి .

బీర్బల్ తెలివితేటలు




Chinnapillala Kathalu


ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు. దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.

సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు కేకలూ అరుపులూ మొదలపెట్టాడు సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.

ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు తెల్లవారింది ఇద్దరు దర్బారులో హాజరయ్యారు బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, నీ గుర్రం తీసుకో, అన్నాడు అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.

అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.

సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు.

పేదరాశి పెద్దమ్మ కథ....




ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట, పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి...మర్చిపోయాను అని అడిగిండట.

అప్పుడు పెద్దమ్మ నీ పేరు నాకేం తెలుసు, నా కొడుకునడుగు అందట ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా...... అన్నదట.

అప్పుడతను నీ పేరు నాకేం తెలుసు....... నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి అనడిగిండట. అప్పుడు గొడ్డలి, నీ పేరు నాకేం తెలుసు..... నేను నరికే ఈ చెట్టునడుగు అందట.

ఈగ చెటు దగ్గరకు వెళ్ళి పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి....... అనడిగిండట. అప్పుడా చెట్టు నీ పేరు నాకేం తెలుసు... చెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు అందట.

అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా...... అనడిగిందట. అప్పుడా గుర్రం నీ పేరు నాకేం తెలుసు...... నా పొట్టలో ఉన్న పిల్లనడుగు అందట.

అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్ట లోని పిల్లా నా పేరేమిటో తెలుసా....... అనిఅడిగిండట.

అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల ఇహీ...నీ పేరు నీకు తెలియదా....... నీ పేరు ఈగ అందట.పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

తెనాలి రామలింగడు.. లెంపకాయ ఖరీదు.......

Chinnapillala Kathalu - Tenali Ramakrishna Stories
ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు, ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది కిందపడిపోయాడు, ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు.

తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు...నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా.....నన్నెందుకయ్యా కొట్టావు.. అని అడిగాడు, అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు వెంటనే అతడు కంగారుపడుతూ.. అయ్యా.. తమరనుకోలేదండీ, నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు, వాడనుకుని తమాషాగా కొట్టానంతే..... అని చెప్పాడు.
 
సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..... అంటూ అందరూ గట్టిగా నిలదీశారు, అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు, అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

పోనీలేవయ్యా రామలింగా.....ఏదో తెలియక పొరపాటు చేశాడు, ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో.. అన్నాడు మంత్రి, అయితే రామలింగడు ససేమిరా అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే, సందుచూసి పారిపోయాడు ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది.

మంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు...అయితే మంత్రిగారూ.. నాకు తెలియక అడుగుతాను దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే.... అన్నాడు అంతేగా మరి.. అన్నాడు మంత్రి. ఓహో.. అలాగా... అని నవ్వుతూ అన్నాడు రామలింగడు.

వెంటనే మంత్రి గారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు మంత్రి కుయ్యో.. మొర్రో.. అంటూ.. ఎందుకయ్యా రామలింగా.. నన్ను కొట్టావు.. అని అడిగాడు మంత్రిగారూ.. నాకు అవతల బోలెడంత పని ఉంది నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా..! నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి, మీరు దాన్ని ఉంచుకోండ ని చెప్పి ఎంచక్కా అక్కడినుంచి వెళ్లిపోయాడు తెనాలి రామలింగడు.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం....

Chinna Pillala Kathalu - Monkey Story
ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది, అది వూళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది, మంగలి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు.

ఓ కోతి... ఓ కోతి... నా కత్తి....నా కత్తి... అన్నాడు

కోతి వెనక్కి తిరిగి, ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం... అని వెక్కిరించి పారిపోయింది.

కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది.

ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది.,జాలిపడి అతని చేతికి కత్తి అందించింది, ఆ మనిషి సంతోశంగా మట్టెలు కత్తితో కొడుతుంటే, పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం......కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం..... అని పాడుకుంటూ తన దారిని వెళ్ళిపోయింది కోతి.

దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి, ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకుని బెల్లం అచ్చులు వాటిమీద పెట్టడం మొదలు పెట్టాడు, అలవాటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకుని, వెక్కిరిస్తూ పారిపోయింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం.....కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం.......మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం.....

న బెల్లం అచ్చులు.... దొంగ కోతి.... అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ వుండిపోయాడు.

కొంచం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది, కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది, పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది, అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం....
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం....
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం.....
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం.....

కొంత సేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు ఎదురయ్యారు, వాళ్ళకి బూరెలు ఇచ్చింది, వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మయిమరిచిపోయారు, కోతి గోవును తోలుకుని వెళ్ళిపోయింది.

కోతి... కోతి.... మా గోవును ఇచ్చేయి... అని చాలా దూరం కాపర్లు తరిమేరు, కాని కోతి వాళ్ళకు చిక్కలేదు.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం........
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం.....
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం......
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం......
బూరెలు పోయి గోవు వచ్చే ఢాం ఢాం ఢాం....
 
రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలిసిపోయింది.

ఆబ్బ.... చాలా కష్ట పడ్డాను ఇవాళ, వొళ్ళంతా పులిసిపోయింది, వెన్నీళ్ళు కాచు, స్నానం చేసి విశ్రమిస్తాను, అని గోవును ఆజ్ఞాపించింది.

గోవుకి బాగా కోపమొచ్చింది, సలసలా మరిగించిన నీళ్ళను తీసుకొచ్చి కోతి వంటిమీద భళ్ళున పోసేసింది, కోతి కుయ్యో మొర్రో మని ఏడుస్తుంటే, తోలు వూడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది.

కథ కంచికి మనం ఇంటికి.

Friday, 19 June 2015

సరదా కథ - బుడంకాయ బుడ్డోడు..

Chinnapillala Kathalu
అనగనగా ఒక ఊరిలో బుడంకాయంత బుడ్డోడున్నాడు, ఆ బుడంకాయంత బుడ్డోడికి ఒక రోజు వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంటే దోసకాయంత దొంగోడు చూస్తాడు, ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి తాటికాయంత తాళం పగలగొట్టి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలమ్మ చూసి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకొని లవంగం అంత లాఠి పట్టుకొని వచ్చి ఆ దొంగని పట్టుకొని, కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు, అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలమ్మ కి బంగాళ దుంప అంత బహుమానం ఇచ్చాడంట.

Wednesday, 17 June 2015

సోము-తాబేలు

Chinna Pillala Kathalu
అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు.దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు సోముకు అక్కడి వాతావరణం ప్రశాంతత చాలా నచ్చాయి.

అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు.

ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు ఆశ్చర్యం నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. ఓ మంచి అబ్బాయీ నీ మేలు మరువలేనిది ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో అన్నది సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు.

ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.

ఇక చేసేదేమీలేక తెలివిగలవారూ సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామని రాజావారు చాటింపించారు చాటింపును విన్న సోము ఆలోచించాడు

ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది అని అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది.

ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది.

హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి దయ గల రాజు అని పేరు తెచ్చుకున్నాడు.

స్నేహం....

Chinna Pillala Kathalu
ములుగు అడవిలో ఒక చెట్టుకింద నెమలి మరియు పాము నివాసముండేవి. ఆ రెండింటికీ స్నేహం కుదిరింది ఓరోజు ముంగిస వచ్చి పాము మీద దాడి చెయ్యబోయింది పాము మిత్రమా రక్షించు మని అరిచింది వెంటనే నెమలి వచ్చి ముంగిస ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది.

ముంగిస పామును వదిలేసి పారిపోయింది మరోసారి పాము నెమలి మాట్లాడు కుంటున్నాయి వేటగాడు వచ్చి నెమలి మీద వలవెయ్య బోయాడు అది గమనించిన పాము పరిగెత్తుకెళ్లి వాని కాలు కాటేసింది వాడు లబోదిబోమంటూ పరిగెత్తాడు.

ఆ రెండూ ఇలా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారు అదే అడవిలో తిరుగుతున్న తోడేలుకు ఆ నెమలి మాంసం తినాలని నోరూరింది. పాముతో కలిసుంటే నెమలి చిక్కదనుకుంది ఆ రెంటికీ వైరం పెట్టాలనుకుంది.

పాము చాటుకు వెళ్లగానే నెమలితో తోడేలు ఓసి పిచ్చి నెమలీ పాము నిన్ను చంపాలని చూస్తుంది జాగ్రత్త సుమా నా సాయం కావాలనుకున్నప్పుడు పిలువు అంది మరోసారి పాము చాటుకు నెమలితో అయ్యో అమాయకురాలా ఆ దుర్మార్గ నెమలి ముంగిసతో మాట్లాడేటప్పుడు నేను చూసాను నిన్ను చంపించాలని చూస్తుంది. జాగ్రత్త సుమా నా సాయం కావాలంటే అడుగమంది.

పాము, నెమలి తోడేలు చెప్పిన దాని గురించి ఆలోచించాయి అకారణంగా పాము ననె్నందుకు చంపాలనుకుంటుంది అని నెమలి, అదేవిధంగా పాము ఆలోచించాయి రెండూ కలిసి తోడేలు తమతో చెప్పిన విషయం చెప్పుకుని నవ్వుకుంటున్నాయి.

దూరంనుండి తోడేలు అటే వస్తోంది ఆ రెండు అది గమనించి పోట్లాడుకుంటున్నట్టు నటించసాగాయి అది నిజమే అనుకున్న తోడేలు సంతోషించి పాముతో నేనా నెమలిని పట్టి ఇవ్వాల్నా అని అడిగింది దాని పన్నాగం రెండూ గ్రహించి సైగ చేసుకున్నాయి రెండూ కలిసి తోడేలు మీద మెరుపు దాడి చేసాయి.

పాము దాని కాళ్లను కాటేసింది నెమలి దాని ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది అది భరించలేక తోడేలు కుయ్యో మొర్రో అంటూ పారిపోయింది.