![]() |
తామే గొప్ప అని గర్వం పనికి రాదు |
ఒకవూళ్ళో ఒక ముసలమ్మ వుంది తాను గొప్పమాటకారినని గర్వం ఎవరేంచెప్పినా ఠక్కున సమాధానం ఇవ్వగలనన్న ధీమా ఒకరోజు ఆమె వూరి బయట తోటలోకి వెళ్ళింది అక్కడ ఒక నేరేడు చెట్టుమీద ఒక కుర్రాడు కనపడ్డాడు చెట్టునిండా నేరేడుపళ్ళు విరగ కాసాయి మన ముసలమ్మకు నోరూరింది తను చెట్టు ఎక్కలేదు కనుక కుర్రడిని కాసిని పళ్ళు కోసి ఇమ్మంది అందుకా కుర్రాడు అవ్వా నీకు వూదుకు తినేపళ్ళు కావాలా లేకపోతే మామూలు పళ్ళు కావాలా అని అడిగాడు.
ఓరి కుర్ర కుంకా నేరేడు పళ్ళు వేడిగా వుంటాయా ఏమన్నానా వూదుకుతింటానికి వెధవకబుర్లు నాదగ్గర చెప్పకు అంది వెటకారంగా నిజం అవ్వా వూదుకునే తినాలి అన్నాడు ఆకుర్రాడు ఏది అలా వూదుకుతినే పళ్ళు పడెయ్యి చూస్తా అంది అవ్వ సరే అవ్వా నువ్వు నా మాటలు నమ్మడంలేదు కనుక ఇదిగో నీకు కొన్ని పళ్ళు కిందకి పడెస్తా కాని జాగ్రత్త వూదుకు మరీ తిను అని చెట్టు కొమ్మ దులిపాడు కింద చాలా నేరేడుపళ్ళు పడ్డాయి.
అవ్వ కొన్ని ఏరుకొని వాటికి మట్టి అంటుకోవడంతో ఒక్కొక్కటే మట్టిపోయేలా వూదుకొని తింది ఏం అవ్వా చూసావా వూదుకుతినే పళ్ళు అన్నాడు కుర్రాడు అవ్వ సిగ్గుతో తల వంచుకుంది.
!!! తామే గొప్ప అని గర్వం పనికి రాదు !!!
No comments:
Post a Comment