Friday, 31 July 2015

హ్యాపీ బుద్ధా..... లాఫింగ్‌ బుద్ధా......

Laughing Buddha


గుమ్మడికాయలా గుండ్రటి తలకాయ.. బానలాంటి పెద్ద బొజ్జ.. మనసారా నవ్వుతూ కనిపించే ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు హ్యాపీ బుద్ధా, లాఫింగ్‌ బుద్ధా, బుదాయ్‌గా చాలా ఇళ్లలో ఈ వింత రూపం కనిపిస్తూనే ఉంటుంది.

ఈ నిండుమనిషి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడని చెబుతుంటారు భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన.. పిల్లలు ఏది అడిగినా జోలెలో నుంచి తీసిచ్చేవాడట ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే.. ఆ రోజంతా హాయిగా గడిచిపోయేదట జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా భావించి పూజించేవారు థాయ్‌లాండ్‌లోనూ బుదాయ్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది ఇక మన దేశంలోనూ లాఫింగ్‌ బుద్ధను సాక్ష్యాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు ఈ నవ్వే దైవం విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉండవని విశ్వసిస్తారు అందుకే శుభకార్యాలకు లాఫింగ్‌ బుద్ధుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా మారింది అయితే విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో.. ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నిల్చుంటే ఆరోగ్యం..

రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుదాయ్‌ ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు  ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందట అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదని చెబుతున్నారు బుదాయ్‌ ఫాలోవర్స్‌  ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉంచవచ్చు.

సువర్ణావకాశం..
బంగారు నాణేల మీద తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. కాసులపై కొలువుదీరిన హ్యాపీ బుద్ధాను వాయవ్య దిశలో.. ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. బంగారు రంగులో నిగనిగలాడే బుదాయ్‌ ప్రతిమ నెగెటివ్‌ సిగ్నల్స్‌ను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు. వాయవ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉంటే.. అప్పుడు ఈ ప్రతిమను ఆగ్నేయ దిశలో ఉంచితే మేలు.

విన్స్‌ ద కెరీర్‌..
డ్రాగన్‌ టార్టాయి్‌సపై దర్జాగా కూర్చున్న హ్యాపీ బుద్ధా కెరీర్‌లో విశేషమైన మార్పులకు నాంది పలుకుతాడట. ఆదాయ మార్గాలనూ అమాంతంగా పెంచేస్తాడట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉంచాలి.

పిల్లలకు పెన్నిధి..

చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే హ్యాపీ బుద్ధా ప్రతిమ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. పిల్లల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందట. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

జ్ఞాన ప్రదాత..
క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. తద్వారా వారి తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయని భావిస్తారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.

Thursday, 16 July 2015

రంగు వెలిసిన ఏనుగు

రంగు వెలిసిన ఏనుగు












అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది  కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు ఇంతలో వర్షం మొదలయ్యింది చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు.

ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

నీ మనసే నీకు శత్రువు

మన మనస్సే మనకి శత్రువు లోకంలో శత్రుత్వం లేదు , శత్రువు లేడు, మరి ఉన్న శత్రువులు ఎక్కడినుండి వచ్చారు నీ మనసే నీకు శత్రువు దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది.

ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు ఊ అంటే కోపం, ఆ అంటే కోపం ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు పాపం ఈవిడ అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం అని తెగ బాధ పడిపోతుంది ఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది జరిగిందంతా చెప్పింది.

ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది దానికి సమధానంగా స్వామీజీ బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా అన్నాడు ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని సచ్చినోడా నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది.

వెంటనే స్వామీజీ నవ్వుతూ ఆగమ్మా ఆగు ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు నేను
దూషించాననే కదా అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు నేను వాడిన బాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం అంతే తప్ప మరొకటి కాదు ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు అని చెప్పి వెళ్ళిపోయాడు.

స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు.


తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య.

తెనాలి రామలింగడు


ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు అయ్యా.. రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.

కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు ఏంకావాలో కోరుకోమని అన్నాడు దీంతో మహారాజా... నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు.. అన్నాడు రామలింగడు, ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా... అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడాయన పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు. దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది.
చూశారా పిల్లలూ... ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...


బేతాలుని కథలు ( బ్రాహ్మణ బాలుని కథ )

బేతాలుని కథలు












పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది.

కాని మనుషులు వారి స్వార్దం కోసం ఏమైనా చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు, బ్రాహ్మణ బాలుని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు, మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది మెల్లిగా ఆమెని చేరి ఓ సుందరీ నీవెవ్వరు ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి రాజా నేను ముని కన్యను ఈ అరణ్యంలోనే మా నివాసం అంది, రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు ఆమె రాజా నేను ముని వృత్తిలో నున్నదానిని మీరు దేశాన్నేలే మహారాజులు మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు, నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి అంది, వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ వద్దు. వద్దు నన్ను చంపవద్దు అన్నాడు ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పు తప్పక నెరవేరుస్తా అన్నాడు రాజు.

నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు రాజు తంత్రవర్మ సరేనన్నాడు రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు.

వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు బ్రాహ్మణుడు రాజా నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో అన్నాడు, అంతలో అతడి భార్య మహారాజా నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి అన్నది రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు.

ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి విక్రమాదిత్య మహారాజా ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా భేతాళా ఆబాలుడి నవ్వులో ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి అన్నభావం ఉన్నది అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు అన్నాడు రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.


దొంగను మించిన దొంగ...



పూర్వం జంపయ్య, మొగలయ్య అనే పేరు మోసిన దొంగలు ఉండేవారు ఎవరి ప్రాంతాలలో వారు పెద్ద దొంగగా పేరు సంపాదించారు ఒకరి గురించి మరొకరు విన్నారు కానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు జంపయ్యను తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్య అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు జంపయ్య కన్ను ఆ గిన్నెపై పడింది ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు, మొగలయ్య అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యకు ఆ ఇంట్లోనే మరొక చోట పడక ఏర్పాటు చేశాడు మొగలయ్య గాఢ నిద్రలో ఉండగా జంపయ్య వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు తెచ్చి ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు అవి నీటిని పీల్చుకున్నాయి జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్లు పడుకున్నాడు మొగలయ్య మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు, అది జంపయ్య పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్య గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

మరునాడు జంపయ్య ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయా’’ అని అడిగాడు అప్పుడు మొగలయ్య తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు జంపయ్యకు అంతా అర్ధమయిపోయింది దొంగను దొంగే పట్టాలి కదా అని మనసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. 


Wednesday, 8 July 2015

అసలైన బాహుబలి కథ

అసలైన బాహుబలి కథ

అసలైన బాహుబలి గురించి .. కాస్త చరిత్రలోకి తొంగిచూద్దాం గూగుల్ లోకి వెళ్ళండి బాహుబలి అని సెర్చ్ చేయండి... వస్తే గిస్తే ప్రభాస్ గురించో, రాజమౌళి గురించో లేక రానా గురించో, అంతకు మించితే ట్రైలర్ల హడావుడి గురించో కనబడుతోంది. కానీ సహనానికి ఐకాన్ లాంటి బాహుబలి మన గడ్డపై నిజంగా నివసించిన అసలు సిసలు బాహుబలి గురించి ఎక్కడా కనబడదు,వినబడదు.

అవును బాహుబలి సహనానికి కెరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత,రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను కాస్త చరిత్రలోకి తొగి చూద్దాంఋషబుని కుమారుడు బాహుబలి ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు ఇతడికి ఇద్దరు భార్యలు రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.

అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడుస్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.

ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు
మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.

వీరు సంసార జీవితం కొనసాగిస్తారు దిగంబరులు సన్యాసులు వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది 58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది.
క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.

Tuesday, 7 July 2015

తామే గొప్ప అని గర్వం పనికి రాదు

తామే గొప్ప అని గర్వం పనికి రాదు












ఒకవూళ్ళో ఒక ముసలమ్మ వుంది తాను గొప్పమాటకారినని గర్వం ఎవరేంచెప్పినా ఠక్కున సమాధానం ఇవ్వగలనన్న ధీమా ఒకరోజు ఆమె వూరి బయట తోటలోకి వెళ్ళింది అక్కడ ఒక నేరేడు చెట్టుమీద ఒక కుర్రాడు కనపడ్డాడు చెట్టునిండా నేరేడుపళ్ళు విరగ కాసాయి మన ముసలమ్మకు నోరూరింది తను చెట్టు ఎక్కలేదు కనుక కుర్రడిని కాసిని పళ్ళు కోసి ఇమ్మంది అందుకా కుర్రాడు అవ్వా నీకు వూదుకు తినేపళ్ళు కావాలా లేకపోతే మామూలు పళ్ళు కావాలా అని అడిగాడు.

ఓరి కుర్ర కుంకా నేరేడు పళ్ళు వేడిగా వుంటాయా ఏమన్నానా వూదుకుతింటానికి వెధవకబుర్లు నాదగ్గర చెప్పకు అంది వెటకారంగా నిజం అవ్వా వూదుకునే తినాలి అన్నాడు ఆకుర్రాడు ఏది అలా వూదుకుతినే పళ్ళు పడెయ్యి చూస్తా అంది అవ్వ సరే అవ్వా నువ్వు నా మాటలు నమ్మడంలేదు కనుక ఇదిగో నీకు కొన్ని పళ్ళు కిందకి పడెస్తా కాని జాగ్రత్త వూదుకు మరీ తిను అని చెట్టు కొమ్మ దులిపాడు కింద చాలా నేరేడుపళ్ళు పడ్డాయి.

అవ్వ కొన్ని ఏరుకొని వాటికి మట్టి అంటుకోవడంతో ఒక్కొక్కటే మట్టిపోయేలా వూదుకొని తింది ఏం అవ్వా చూసావా వూదుకుతినే పళ్ళు  అన్నాడు కుర్రాడు అవ్వ సిగ్గుతో తల వంచుకుంది.

!!! తామే గొప్ప అని గర్వం పనికి రాదు !!!

Monday, 6 July 2015

గర్వం విష తుల్యం

గర్వం విష తుల్యం



పూర్వం ఒక అడవిలో ఒక నదీ తీరాన చాలా వృక్షాలు ఉండేవి వాటన్నింటి లోకీ చాలా పొడవైనది బూరుగు చెట్టు నదీ తీరంలోపచ్చని పచ్చిక ఉండేది నీటి అలలు వచ్చినప్పుడల్లా ఆ గడ్డి పోచలు తలలు వంచి అవి పోయాక లేస్తుండేవి ఒక రోజున వర్షం పడటంతో నదికి ప్రవాహ వేగం పెరిగింది దాంతో గడ్డి పోచలు తలలు వంచి నీటి ప్రవాహం వాలుకు ఉండి పోవలసి వచ్చింది సాయం కాలానికి నదీ ప్రవాహం తగ్గింది అప్పుడు పచ్చిక మొక్కలు హాయిగా తల లెత్తి నవ్వు కుంటూ చుట్టూ చూడ సాగాయి.

నది గట్టు పక్కనే ఉన్న బూరుగు చెట్టు వాటి వైపు చూసి ఫక్కున నవ్వింది ఆ సవ్వడికి గడ్డిమొక్కలన్నీ తలలు తిప్పి ఆ సవ్వడి వచ్చిన వైపు చూశాయి వాటిని చూసి బూరుగు చెట్టు తిరిగి పక పకా నవ్వింది పక్కనే ఉన్న మిగిలిన చెట్లు దాని వైపు చూసి ,ఎందుకు నవ్వుతున్నావ్... అని అడిగాయి.

దానికి బూరుగు చెట్టు గమనిస్తే మీరంతా కూడా ఫక్కున నవ్వు తారు చూడండీ ఉదయం నుండీ ఈ గడ్డి పోచలు నీళ్ళకు భయ పడి తలలు వంచుకుని ఉన్నాయి  ఇప్పుడు నీరు తగ్గాక తల లెత్తాయి వాటిని చూస్తే నవ్వు కాక మరే మొస్తుందీ పాపం చిరుప్రాణులు వాటి భయం చూసి నాకు ఆగని నవ్వు వస్తున్నది అంటూ ఇంకా నవ్వ సాగింది బూరుగు చెట్టు మిగతా చెట్లు  తప్పుకాదూ .... ఇతరులను చూసి అలా నవ్వడం  అవి వింటే ఏమను కుంటాయి చెట్ల జాతి మన మంతా ఒక్కటే కదా....అన్నాయి.

ఏంటీ ఆ గడ్డి పోచలూ మనమూ ఒక్కటేనా ఆ గడ్డి పోచలు మన జాతా మాట్లాడకండి , నాకు అసహ్యమే స్తుంది అంది ఠీవిగా తలెత్తి గడ్డిపోచలూ మనజాతే  పెద్ద చిన్న అంతే తేడా మనలో వట వృక్షం ఎంత పెద్దదీ మనం కేవలం చెట్లమే, వృక్షాలం కాదు కదా అలాగే ఆ గడ్డి పోచలూనూ, ఎవరి గొ ప్పవారిదే అంది వేప చెట్టు. గడ్డిపోచలన్నీకలిసి ఏనుగునే కట్టేస్తాయి అనే విషయం నీవు విన్నట్లు లేదు అంది రాగిచెట్టు. చాలించండి మీ మాటలు మన వృక్ష జాతికే అవమానం  పసి పిల్లలు వేలితో తుంపితే తెగే ఈ గడ్డి పోచలూ మనమూ ఒక జాతా అంటూ అట్ట హాసంగా అరిచింది బూరుగు చెట్టు.

ఇంతలో గాలి వీచడం మొదలైంది రాను రానూ క్షణాల్లో గాలి వేగం హెచ్చింది చూస్తుండ గానే తీవ్రమైన గాలిగా మారింది ఆ గాలి తాకిడికి చెట్ల తలలన్నీ ఊగసాగాయి ఆకులు తెగి పడ సాగాయి కొన్ని చెట్ల కొమ్మలు సైతం తెగి క్రింద పడ సాగాయి ఉన్నట్లుండిబూరుగు చెట్టు మధ్యకు విరిగి పడి మొండెం మాత్రమే మిగిలింది మరి కాస్సేపటికి గాలి తగ్గింది చెట్లన్నీ తెప్పరిల్లి చూట్టూ చూశాయి.

అన్నిచెట్లకూ కేవలం కొన్నికొమ్మలూ రెమ్మలూ మాత్రమే పోగా బూరుగు చెట్టు సగానికి తెగి ఉండటం చూసి , సానుభూతిగా పలక రించాయి బూరుగు వృక్షమా....... క్షేమమేకదా.

బూరుగు విచారంగా ,బలహీన స్వరంతో , గర్వించిన దాని ఫలితం వెంటనే తగిలింది చిన్నతనంలో మా అమ్మ ‘గర్వం తీయనైన విషం ఎవ్వడూ దేనికీ గర్వించకు, పెద్ద వారి ముందు, మన కన్నాశక్తి వంతుల ముందూ తలవంచడం మంచిది అని చెప్పింది,నేనే మీ అందరి కంటే ఎత్తుగా ఉన్నానని గర్వించి , మిమ్మూ , ఆ గడ్డి పోచలనూ తక్కువ చేసి మాట్లాడాను నేను మధ్యకు విరి గాను కానీ,ఆ గడ్డి పోచ లలాగే తలలు ఊపు కుంటూ ఉన్నాయి అంతా నన్ను , నా గర్వాన్నీ మన్నించండి అంది మిగతా చెట్లన్నీ’ మిత్రమా... తెలీక జరిగిన పొరపాటు మర్చిపో పశ్చాత్తాపమే దానికి విరిగిడు కొద్ది రోజుల్లోనే తిరిగి చిగురిస్తావులే ,కొమలు తొడుగు తావులే దిగులుపడకు.. బాధపడకు అంటూ బుజ్జ గించాయి.

నదీ తీరం లోని గడ్డి పోచలు మాత్రం ఎప్పటిలా అలాగే హాయిగా నవ్వుకుంటూ, నీరు వచ్చినపు డు తలలు వంచు కుంటూ ,తర్వాత ఎత్తుకుంటూ ఉన్నాయి. వినయం విజయానికి చిహ్నం కాదూ.

నీతి- గర్వం విష తుల్యం.



ఒక మంచి కధ...


ఒక మంచి కధ...


ఒక రోజు ఒక అంధుడు ఒక బంగాళా మెట్ల దగ్గర తన టోపీ తో మోకాళ్ళ మిద కూర్చున్నాడు.మరియు ఒక బోర్డు మీద నేను అంధుడిని, నాకు సహాయం చేయగలరు అని రాసిపెట్టుకున్నాడు. 

అది చూసిన జనాలు కొంతమంది మంది మాత్రమే డబ్బుల్ని టోపిలో వేస్తునారు కాసేపటికి ఒక వృధుడు అటుగా వెళ్తూ ఆ బోర్డ్ ని చూసి తన జేబులో నుండి కొంత డబ్బుని తీసి ఆ టోపిలో వేసాడు తర్వాత తన దగ్గర ఉన్న కలాన్ని తీసి ఆ బోర్డ్ మిద ఎదో రాసి వెళ్ళాడు అప్పటినుండి ఆ టోపిలో చాల డబ్బులు వచ్చి పడ్డాయి.

ఆ టోపీ మొత్తం డబ్బు తో నిండిపోయింది కాసేపటికి ఆ వృధుడు మరల అక్కడికి వచ్చాడు తన అడుగుల శబ్దాన్ని గమనించిన ఆ అంధుడు ఆ వృధుడుతో మీరు ఇందాక నా బోర్డ్ మీద ఎదో రాసినట్టు ఉన్నారు, అప్పటినుండి డబ్బులు ఎక్కువ వచాయి ఇంతకీ ఎం రాసారు అని అడిగాడు.

అప్పుడు ఆ వ్రుధుడు ఇలా సమాధానం ఇచాడు ఈ రోజు చాలా అందమైనది కానీ నేను చూడలేను....ఒకసారి ఆలోచించండి బోర్డు మీద రాసిన మొదటి పదం, ఇప్పుడు వృధుడు రాసిన పదం రెండు చూడటానికి ఒకలాగే ఉన్నాయి కదా...అవును ఇద్దరు రాసిన పదాలు ఆ వ్యక్తీ అంధుడు అని చెపుతున్నాయి.

కానీ మొదట పదం సులభ పద్దతిలో తను అంధుడిని అని చెపుతుంది కానీ రెండవ పదం, మనం చాలా అడురుష్టవంతులం . అందులం కాదు అందమైన ప్రపంచాని చూస్తున్నాము... మనం అందులం కాదు అందుకే ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం కానీ మనలాంటి కొందరు అందులుగా ఉన్నారు...

వారు మనలాగా ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేరు.. కాబట్టి, అంధులు కనపడితే మీకు తోచిన సహాయం చేయండి...


Thursday, 2 July 2015

పన్నెండు మంది శిష్యుల కథ

Chinnapillala Kathalu


గురువుగారు  పరమానందయ్యగరు వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు పేరు పరమానందయ్యగారి శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.
*******                  ********                 **********                 ********                   *******
పూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి అని శాపం ఇచ్చింది.

వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు కనుక నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు అని ఆమెను శపించాడు భూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు అతను మహా పండితుడు ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు.

రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.

పరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో దిట్ట ఆయనకు రాజాశ్రమముంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.



అంతా మన మంచికే...

Cinnapillala Kathalu
అనగనగా ఒక రాజ్యం దానికో రాజుగారు రాజుగారి కొలువులో ఒక విదూషకుడుండేవాడు విదూషకుడు మంచి తెలివైనవాడు, చతురుడు, దైవభక్తి కలిగినవాడూను దేవుడిమీద భారం వేసి, ఏం జరిగినా అంతా మన మంచికే అని నమ్మేవాడెప్పుడూను రాజుగారికీ విదూషకుడికీ మంచి స్నేహం.

ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి కొలువుకి పర్షియా దేశం నుంచి ఒక అరబ్బీ వర్తకుడొచ్చాడు ఇరవై గుర్రాల మీదా, ఇరవై ఒంటెల మీదా చిత్రవిచిత్రమైన సామాన్లు పట్టుకొచ్చాడతను, మన రాజుగారికి చూపించడానికి రుబ్బురోలు పొత్రాలంతంత రత్నాలు, రయ్యిన గాల్లో ఎగిరే తివాచీలు, ముత్యాలు కుట్టిన పరదాలు, బంగారపు తీగలతో నేసిన కంబళ్ళు, పొడుగాటి కత్తులు, ఒక వెంట్రుకను నాలుగు వెంట్రుకలుగా చీల్చేటంత పదునైన కటార్లు, మనుషులని మరుగుజ్జులుగా చూపించే అద్దాలు, మీట నొక్కితే ఆడే పాడే బొమ్మలు, చెవిలో పెట్టుకుంటే ఊరవతల ఎవరో మాట్లాడుకునే మాటలు కూడా ఇక్కడికి వినపడే శంఖాలు, ఇలాంటివన్నీను రాజుగారు సరదాపడి అరబ్బీ వర్తకుడు తెచ్చిన కత్తినొకదాన్ని పరీక్ష చెయ్యబోయారు ఇంకేముంది, పదునైన కత్తి మొనకి రాజుగారి చిటికెనవేలు తగిలి కోసుకుపోయింది. బొటబొటా నెత్తురు కారిపోయింది పక్కనే ఉన్న రాణీగారు, అయ్యయ్యో ఎంత పని జరింగిందీ అంటూ చీర చెంగు సర్రున చింపి గబగబా వేలికి కట్టు కట్టేసారు. 

రక్తమైతే ఆగింది గానీ పాపం రాజుగారికి బోల్డంత నొప్పెట్టింది పక్కనే ఉన్న విదూషకుడు చూసినవాడు చూసినట్టు ఊరుకోకుండా, అంతా మన మంచికే అనేసాడు అలవాటు చొప్పున ఇంకేముంది, రాజుగారికి వొళ్ళు మండిపోయింది అసలే వేలు తెగిన నొప్పిమీదున్నవాడికి అయ్యో పాపం అనకుండా, బాగానే అయ్యింది అంటే కోపం రాదూ మరి పైగా రాజుగారాయె కత్తికి తెలీదనుకో రాజుగారని, విదూషకుడికి తెలియద్దూ ఎవరక్కడ అని ఒక్క కేక పెట్టారు రాజుగారు చిత్తం ప్రభూ అని ఇద్దరు భటులు పరిగెట్టుకుంటూ వచ్చారు ఈ విదూషకుణ్ణి పట్టుకెళ్ళి చెరసాల్లో పడెయ్యండి అని ఆఙ్ఞాపించేసారు రాజుగారు అప్పుడైనా ఊరుకోవాలా విదూషకుడు అంతా మన మంచికే అనేసి భటుల వెంట వెళ్ళిపోయాడు.

మరునాడు రాజ్యంలో ఉన్న పల్లె ప్రజలు కొంతమంది రాజుగారి దర్శనం చేసుకుని, మా పల్లెల పక్కనున్న అడవుల్లోంచి పులులొచ్చి మా మేకలని ఎత్తుకుపోతున్నాయి మారాజా మీరొచ్చి పులుల్ని వేటాడి మమ్మల్ని కాపాడాలి అని మొర పెట్టుకున్నారు రాజుగారు సరేనని చెప్పి, పరివారంతో మరునాడు వేటకు బయలుదేరారు రోజంతా పులుల్ని వేటాడి వేటాడి రాజుగారు, పరుగెత్తి పరుగెత్తి రాజుగారి గుర్రం అలిసిపోయాయి నెమ్మదిగా వెనకబడిపోయి పరివారం నుంచి వేరైపోయారు రాత్రైపోయింది కళ్ళు పొడుచుకున్నా కనపడని చిమ్మ చీకటి దారి తప్పిన రాజు గారు ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నారు ఆ కొండల్లో నరబలులిచ్చే కొండజాతి వాళ్ళుంటారు ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న రాజుగారు ఆ కొండజాతి వాళ్ళకి చిక్కిపోయారు ఇంకేముంది రాజుగారికి పూసల దండలు, పూల దండలేసి బాగా అలంకరించి కొండదేవత విగ్రహం ముందుకి తీసుకుపోయారు బలివ్వడానికి కొండజాతివాళ్ళ గురువు పూజకి తెచ్చిన పండు పుచ్చులు దెబ్బలు లేకుండా ఉందో లేదో చూడండర్రా అన్నాడు వెంటనే కాగడాలు తెచ్చి వాళ్ళు రాజుగారి వొళ్ళంతా పరీక్ష చేసారు వాళ్లల్లో ఒకడికి తెగి కట్టు కట్టి ఉన్న రాజుగారి వేలు కనబడింది ఈ పండు పనికిరాదు దేవరా.. దీనికి దెబ్బ తగిలింది అని అరిచాడు వాడు రాజుగారి కట్లు విప్పేసి, మళ్ళీ అడవిలో వదిలేసారు వాళ్ళు బ్రతుకుజీవుడా అనుకుని పడుతూ లేస్తూ ఎలాగో తెల్లారేసరికి ఒక పల్లె చేరి అక్కణ్ణుంచి అంచెలమీద రాజధాని చేరుకున్నారు రాజుగారు.

రాజభవనానికి చేరగానే విదూషకుడిని చెరసాల నుంచి విడుదల చేయించారు విదూషకా, ఏం జరిగినా మన మంచికే అని నువ్వన్నది మా విషయంలో నిజమయ్యింది ఆనాడు వేలు తెగుండకపోతే మా ప్రాణాలే పోయేవి తెలుసుకోలేక నిన్ను చెరసాలలో పెట్టాము మమ్మల్ని మన్నించు అన్నారు రాజుగారు మహాప్రభో మీరు చెరసాలలో పెట్టడం వల్ల నాక్కూడా మంచే జరిగింది అన్నాడు విదూషకుడు అదెలాగన్నారు రాజుగారు మీరు నన్ను చెరలో పెట్టించకపోయుంటే మీతో పాటు నేను కూడా వేటకి వచ్చుండేవాడిని. కొండజాతివాళ్ళకి ఇద్దరమూ దొరికిపోయేవాళ్ళం దెబ్బ తగిలిన మిమ్మల్ని వదిలేసి బావున్న నన్ను కొండదేవతకి బలి ఇచ్చేసుండేవాళ్ళు చెరసాలే నా ప్రాణాలు కాపాడింది అని చెప్పాడు విదూషకుడు.

బంగారు మామిడి పళ్ళు












పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని వుంది తెప్పించమని అడిగిందట, అది మామిడి పండ్ల కాలం కాకపోవడము తో ఎక్కడా పండ్లు దొరకలేదట ఆమె మామిడి పళ్ళు తినకుండానే చనిపోయింది రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేక పోయానే అని బాధపడుతూండే వాడట
దురాశా పరుడైన ఆయన పురోహితుడు రాజా మీరు దిగులు చెంద వలిసిన అవసరం లేదు ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరమూ ఆవిడ తిథి నాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయ వచ్చు అని చెప్పాడట రాజుకు అది నచ్చింది.

రాజుతలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు బంగారు మామిడి పళ్ళు తయారైనాయి ఆవిడ తిథి నాడు అందరు బ్రాహ్మణు లకూ తలో బంగారు మామిడి పండు దొరికింది మంత్రి గారికి మాత్రం యిది నచ్చలేదు ప్రతి సంవత్సరమూ యిలా యిస్తూ పోతే ఖజానా ఖాళీ అవడం ఖాయం అని రాజుగారి విదూషకుడిని పిలిపించి దీని కేదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు అతను సరే ననిమంత్రికి ఒక వుపాయ చెప్పి పంపించాడు.

మంత్రి తన తల్లి ఆబ్దికం నాడు నేనూ ఆవిడ చివరి కోర్కె తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు.బ్రాహ్మణు లంతా సంతోష పడ్డారు రాజుగారు బంగారు మామిడి పడ్లు యిచ్చారు యింక ఈ మంత్రి కూడా ఆల్లాంటి దేదో యిస్తాడు అని సంబర పడ్డారు మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది ఆయన ఒక్కొక్క బ్రాహ్మణు డినీ లోపలకు పిలిచి యినప గరిట కాల్చి వాత పెట్టి పెరటి దారిన వారిని పంపించసాగాడు వాళ్ళు మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు రాజు మంత్రిని పిలిపించి యిదేమి పని అడిగాడు.

అప్పుడు మంత్రి మహారాజా మా అమ్మ కీళ్ళవాతం తో చనిపోయింది.చనిపోయే ముందు నాయనా దీనికి వాత ఒక్కటే మందు యినుప గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది నా  భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ
చనిపోయింది మరి కొడుకు గా ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం నా విధి కదా అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు రాజుకు జ్ఞానోదయ మయింది.అప్పటినుండీ బంగారు మామిడి పండ్ల దానం రద్దు చేశాడు.



రెండు గాడిదల బరువు

Chinnapillala Kathalu








ఒకరోజు ఉదయాన అక్బర్ యువరాజు సలీం మరియు బీర్బల్తో కలిసి వాహ్యాళికి వెళ్లాడు అలా వారు నది ఒడ్డుకు వచ్చారు అది ఎండాకాలం కావడంతో ఒక చెట్టునీడన కూర్చున్నారు, కొద్దిసేపయ్యాక అక్బర్, నదిలో స్నానం చేద్దామా అన్నాడు బీర్బల్ నీళ్లలో చెయ్యిపెట్టి చూసి, అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి నేను మాత్రం చెయ్యను ప్రభూ’ అన్నాడు.

అక్బర్, సరే మంచిది సలీం, నేనూ స్నానం చేస్తాము నువ్వు ఇక్కడే ఉండి మా దుస్తులు పట్టుకో అన్నాడు అలా అని అక్బర్, సలీం తమ తమ దుస్తులు విప్పి బీర్బల్కు ఇచ్చి నదిలో దిగి స్నానం చెయ్యసాగారు, అక్బర్, సలీంతో బీర్బల్ ఒక మూర్ఖుడు ఎండలో నిల్చుని మన బట్టలు మోస్తున్నాడు నా కంటికి చాకలివాని గాడిదలా కనిపిస్తున్నాడు.

ఇప్పుడొక తమాషా చేస్తా చూడు అని ఏయ్ బీర్బల్, నువ్వొక గాడిద బరువు మోస్తున్నావు అన్నాడు వ్యంగ్యంగా వెంటనే బీర్బల్, కాదు ప్రభూ, రెండు గాడిదల బరువు మోస్తున్నా అన్నాడు అక్బర్ ముఖం మాడిపోయిoది.

తాబేలు తెలివి

Chinnapillala Kathalu
ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది అది చూసి ఏమిటీ విడ్డూరం తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.

వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో చచ్చానురా అనుకుంది తాబేలు మనసులో వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, పిల్లలూ్ ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.

వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు మీకు నా గానం నచ్చిందా నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి మనందరం కలిసి పాడుతూ ఆడదామ అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో, పిల్లలు తాబేలుని బయటకి తీశారు తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం  అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు ఇవి నాకు సరిపోవు పదండి నదిలో స్నానం చేద్దామ అన్నది తాబేలు ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.
నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.