Thursday, 16 July 2015

తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య.

తెనాలి రామలింగడు


ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు అయ్యా.. రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.

కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు ఏంకావాలో కోరుకోమని అన్నాడు దీంతో మహారాజా... నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు.. అన్నాడు రామలింగడు, ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా... అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడాయన పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు. దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది.
చూశారా పిల్లలూ... ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...


బేతాలుని కథలు ( బ్రాహ్మణ బాలుని కథ )

బేతాలుని కథలు












పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది.

కాని మనుషులు వారి స్వార్దం కోసం ఏమైనా చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు, బ్రాహ్మణ బాలుని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు, మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది మెల్లిగా ఆమెని చేరి ఓ సుందరీ నీవెవ్వరు ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి రాజా నేను ముని కన్యను ఈ అరణ్యంలోనే మా నివాసం అంది, రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు ఆమె రాజా నేను ముని వృత్తిలో నున్నదానిని మీరు దేశాన్నేలే మహారాజులు మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు, నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి అంది, వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ వద్దు. వద్దు నన్ను చంపవద్దు అన్నాడు ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పు తప్పక నెరవేరుస్తా అన్నాడు రాజు.

నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు రాజు తంత్రవర్మ సరేనన్నాడు రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు.

వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు బ్రాహ్మణుడు రాజా నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో అన్నాడు, అంతలో అతడి భార్య మహారాజా నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి అన్నది రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు.

ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి విక్రమాదిత్య మహారాజా ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా భేతాళా ఆబాలుడి నవ్వులో ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి అన్నభావం ఉన్నది అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు అన్నాడు రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.


దొంగను మించిన దొంగ...



పూర్వం జంపయ్య, మొగలయ్య అనే పేరు మోసిన దొంగలు ఉండేవారు ఎవరి ప్రాంతాలలో వారు పెద్ద దొంగగా పేరు సంపాదించారు ఒకరి గురించి మరొకరు విన్నారు కానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు జంపయ్యను తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్య అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు జంపయ్య కన్ను ఆ గిన్నెపై పడింది ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు, మొగలయ్య అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యకు ఆ ఇంట్లోనే మరొక చోట పడక ఏర్పాటు చేశాడు మొగలయ్య గాఢ నిద్రలో ఉండగా జంపయ్య వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు తెచ్చి ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు అవి నీటిని పీల్చుకున్నాయి జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్లు పడుకున్నాడు మొగలయ్య మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు, అది జంపయ్య పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్య గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

మరునాడు జంపయ్య ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయా’’ అని అడిగాడు అప్పుడు మొగలయ్య తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు జంపయ్యకు అంతా అర్ధమయిపోయింది దొంగను దొంగే పట్టాలి కదా అని మనసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. 


Wednesday, 8 July 2015

అసలైన బాహుబలి కథ

అసలైన బాహుబలి కథ

అసలైన బాహుబలి గురించి .. కాస్త చరిత్రలోకి తొంగిచూద్దాం గూగుల్ లోకి వెళ్ళండి బాహుబలి అని సెర్చ్ చేయండి... వస్తే గిస్తే ప్రభాస్ గురించో, రాజమౌళి గురించో లేక రానా గురించో, అంతకు మించితే ట్రైలర్ల హడావుడి గురించో కనబడుతోంది. కానీ సహనానికి ఐకాన్ లాంటి బాహుబలి మన గడ్డపై నిజంగా నివసించిన అసలు సిసలు బాహుబలి గురించి ఎక్కడా కనబడదు,వినబడదు.

అవును బాహుబలి సహనానికి కెరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత,రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను కాస్త చరిత్రలోకి తొగి చూద్దాంఋషబుని కుమారుడు బాహుబలి ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు ఇతడికి ఇద్దరు భార్యలు రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.

అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడుస్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.

ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు
మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.

వీరు సంసార జీవితం కొనసాగిస్తారు దిగంబరులు సన్యాసులు వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది 58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది.
క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.

Tuesday, 7 July 2015

తామే గొప్ప అని గర్వం పనికి రాదు

తామే గొప్ప అని గర్వం పనికి రాదు












ఒకవూళ్ళో ఒక ముసలమ్మ వుంది తాను గొప్పమాటకారినని గర్వం ఎవరేంచెప్పినా ఠక్కున సమాధానం ఇవ్వగలనన్న ధీమా ఒకరోజు ఆమె వూరి బయట తోటలోకి వెళ్ళింది అక్కడ ఒక నేరేడు చెట్టుమీద ఒక కుర్రాడు కనపడ్డాడు చెట్టునిండా నేరేడుపళ్ళు విరగ కాసాయి మన ముసలమ్మకు నోరూరింది తను చెట్టు ఎక్కలేదు కనుక కుర్రడిని కాసిని పళ్ళు కోసి ఇమ్మంది అందుకా కుర్రాడు అవ్వా నీకు వూదుకు తినేపళ్ళు కావాలా లేకపోతే మామూలు పళ్ళు కావాలా అని అడిగాడు.

ఓరి కుర్ర కుంకా నేరేడు పళ్ళు వేడిగా వుంటాయా ఏమన్నానా వూదుకుతింటానికి వెధవకబుర్లు నాదగ్గర చెప్పకు అంది వెటకారంగా నిజం అవ్వా వూదుకునే తినాలి అన్నాడు ఆకుర్రాడు ఏది అలా వూదుకుతినే పళ్ళు పడెయ్యి చూస్తా అంది అవ్వ సరే అవ్వా నువ్వు నా మాటలు నమ్మడంలేదు కనుక ఇదిగో నీకు కొన్ని పళ్ళు కిందకి పడెస్తా కాని జాగ్రత్త వూదుకు మరీ తిను అని చెట్టు కొమ్మ దులిపాడు కింద చాలా నేరేడుపళ్ళు పడ్డాయి.

అవ్వ కొన్ని ఏరుకొని వాటికి మట్టి అంటుకోవడంతో ఒక్కొక్కటే మట్టిపోయేలా వూదుకొని తింది ఏం అవ్వా చూసావా వూదుకుతినే పళ్ళు  అన్నాడు కుర్రాడు అవ్వ సిగ్గుతో తల వంచుకుంది.

!!! తామే గొప్ప అని గర్వం పనికి రాదు !!!