Sunday, 28 June 2015

నా స్వీయానుభవం కుక్క చెప్పిన కథ

Chinnapillala Kathalu








రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు వాడికి నా అనేవాళ్లెవరూ లేరు గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు ఆయనకో చిన్న కొడుకున్నాడు ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు ఆయన దగ్గరికెళ్లి ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది అడిగాడు గోపాల్‌ ఏమో నాకు తెలీదు అని చెప్పాడు అతను తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌ అడిగాడు వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే అని మనుసులో అనుకుని ఇవి గుర్రం గుడ్లు బాబూ కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు అని మనసులో అనుకుని దీని ధరెంత అడిగాడు గోపాల్‌ ఒక్క గుడ్డు యాభై రూపాయలు చెప్పాడతను గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌ ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

ఇరువురు పండితులు

Chinnapillala Kathalu








ఒక గ్రామము లో నున్న పండితుని యింటికి దోఎఅముగా నున్న యింకొక గ్రామము నుండి యింకొక పండితుడు వస్తున్నానని కబురు చేశాడు అతనిని ఎదుర్కొని తీసుకొని రావటానికి ఎడ్ల బండి కట్టుకొని తన వూరి పొలిమేర కు
వెళ్ళాడు ఆ పండితుని తన బండి ఎక్కించుకొని తన యింటికి బయల్దేరాడు దాదాపు2 మైళ్ళు వెళ్ళాలి దారి  గతుకులుగా వుంది బండి కుదుపులు ఎక్కువగా వున్నాయి.

పొరుగూరి పండితుడు అబ్బబ్బ వెధవ బండి అన్నాడు అప్పుడు యజమాని యైన పండితుడు అయ్యా తమరన్నది కర్మధారయమా లేక షష్టీ తత్పురుషమా అన్నాడు కర్మధార య మైతే వెధవ యైన బండి అంటే బండి వెధవదిఅవుతుంది.,షష్టీ తత్పురుష మైతే వెధవ యొక్క బండి అంటే యజమాని వెధవ అవుతాడు.

అప్పుడు పొరుగూరు పండితుడు నవ్వుతూ ఆ రెండూ కాదు లెండి చతుర్థీ తత్పురుషము అన్నాడు అంటే వెధవ కొరకు బండి (అంటే తనే వెధవ అని) యిద్దరూ పెద్దగా నవ్వుకున్నారు అప్పటి పండితులకు భేషజాలు లేవు అన్నీ తేలికగా, తమాషాగా తీసుకునే వారని ఈ కథ మనకు తెలియ జేస్తుంది అన్నిటికీ తప్పు పట్టి దెబ్బలాడ కుండా వుంటే జీవితము ఆనందంగా సాఫీగా సాగిపోతుంది యిప్పటి వాళ్లకు అంత సంయమనము లేదు కదా....

భగవత్గీత ఆవిర్బావం

Chinnapillala Kathalu








భాగవతం కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశము నందు జరిగినది కురుక్షేత్రం ఈనాటి
భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.

కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రధసారధి శ్రీకృష్ణుడు రధాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు.

అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు వారిని చూసి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు.

అలా అర్జునునికి అతని రథసారధి శ్రీకృష్ణునికి  మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

సచ్చిదానంద స్వామి

Chinnapillala Kathalu






సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ వూరూరా తిరుగుతుండేవాడు ప్రజలిచ్చే దక్షిణను ఖర్చుల కోసం స్వీకరించేవాడు కొంత కాలానికి ఆయన దగ్గర ఒక మూట నిండా కాసులు సమకూరాయి దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు.

అది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు ఓసారి వినయంగా స్వామి వారిని కలిసి, నేనొక అనాధను నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను అంటూ అభ్యర్థించాడు స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలెను తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు.

ప్రతి రోజూ గురుశిష్యులు వూరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు ఎవరి జోలెను వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు నాలుగు రోజులు గడిచాక స్వామిజీ గాఢ నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూట కోసం శిష్యుడు వెదికాడు అది కనిపించలేదు నెమ్మదిగా ఆయన జోలె తీసి చూశాడు అందులోనూ లేదు గురువు గట్టోడే కాసుల మూటను ఎక్కడో దాచాడు అనుకున్నాడు శిష్యుడు మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యధావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు.

ఆ రాత్రి కూడా వాడు వెతికి చూశాడు కానీ ఎక్కడా మూట కనిపించలేదు మరో నాలుగు రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది గురువుగారి దగ్గరకు వెళ్లి, స్వామీ ఈ సంచార జీవితం మొహం మొత్తింది ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను సెలవిప్పించండి అన్నాడు తప్పకుండా పోయిరా నాయనా ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు అన్నారు సచ్చిదానంద స్వామి.

వెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి గురువుగారూ నాదొక చిన్న సందేహం పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూట రాత్రి వేళ కనిపించదేం ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు సచ్చిదానంద స్వామి నవ్వి, నాయనా నీ వాలకాన్ని మొదటి రోజే గ్రహించాను.

రోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి ఇతరులది దోచుకోవాలనుకునే వాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్యా అన్నారు శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు.

బాగు కోరేదే భాగవతం






శ్రీకృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయ మూర్తియనీ, బ్రహ్మ సూత్రాలకు భాష్యరూపమనీ, సకల వేదసారమనీ, కామక్రోధాలను జయించడానికి, ధుఃఖ దారిద్య్ర, పాపములను ప్రక్షాళన కావించుటకు, భాగవతానికి మించిన ఔషదము వేరొకటిలేదనీ, కాశి, గంగ, ప్రయాగ, గయ, తీర్ధ సేవనము, భాగవత కధా శ్రవణానికి సాటిరావనీ, ఎక్కడభాగవత కథా శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని.

వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మా్తమ్రుననే శ్రీ మహావిషూ్ణవు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది.

ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వసా్తల్రను ఎందుకని అపహరించాడు బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత
శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు, కంసుడు,
జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడ చేపట్టుకోనని ఎందుకు అన్నాడు.

గోపికలతో రాసకడ్రలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడనికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏవిధంగా ఆమోదింపబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు. ఆటలాడాడు, పాటలూ పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటెవాడనీ అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు. పెద్దవాడై దొరగా రాజ్యపాలనా చేశాడు.

రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలనూ నడిపించాడు రాయబారం చేశాడు రధాన్ని నడిపాడు రాసకడ్రలు సలిపాడు గురుసేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడుమహారాజులచే పాదపూజలందుకున్నాడు శత్రువులను సం హరించాడు చివరకు క్షవర కర్మ కూడ (రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గొరిగాడు) చేశాడు ఆర్తులను ఆదరించి సేదతీర్చాడు ఆపదలోఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందలను మోసాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు.

సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతికెక్కాడు ఆనందరూపుడై ఆబాలగోపాలాన్నీ అలరించాడు మధుర మూర్తియై ప్రేమామృతాన్ని వెదజల్లాడు ఙ్ఞాన స్వరూపుడై ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీ కృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను మహాత్మా్యన్ని స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజూ పఠించాలి ఎంతగా పఠిస్తే, అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి.

భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు  సూచిస్తున్నారు.