Monday, 7 September 2015

పరివర్తన

Chinnapillala Kathalu
అనగనగా ఒక ఊరిలో శేష అనే దొంగ ఉండే వాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైని కుల కళ్ల కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటు న్నారో వినాలనే కుతూహలం కలిగింది. "మహారాజా! మన కుమార్తె వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి" అని మహారాణి అడిగింది. "మహారాణీ! నదికి అవతల ఉండే ఊరిలో కొంత మంది పుణ్యపరుషులు ఉన్నా రనే సంగతి మీకు తెలుసు కదా! వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు. వారిలో ఒకరికి మన ఆ యినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా" అన్నాడు రాజు. అప్పడు రాణి, "చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా' అంది.

ఇదంతా చాటునుంచి వింటున్న శేష, "నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది' అనుకు న్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపరుషులతో కలిసి ఆస్థానానికి ാഠ దుగా మంత్రి వచ్చి "యువరా ణిని పెళ్లిచేసుకోవటం సమ్మత మేనా?” అని అక్కడ ఉన్న ఒక్కొక్కరినీ విడివిడిగా అడి గాడు. అందరూ తమ ఆశయా లకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది, కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు. శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పడు మంత్రి రాజు దగ్గరకు వెళ్లి "మహారాజా! వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలం' అని చెప్పాడు.

అప్పడు మహారాజే స్వయంగా శేష దగ్గరకు “మహానుభావా! మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక. దయచేసి ఈ వివా హానికి అంగీకరించండి" అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. "మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది. నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో అనుకు న్నాడు. ఆ క్షణం నుంచే శేషులో పరివర్తన ప్రారంభమయింది. మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్ప' అని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగ పడే మంచిపనులు చేయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రాణానికి ప్రాణం

Chinnapillala Kathalu
ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. "అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు' అంటూ కోపంగా సోమయ్య "అతను చెప్పింది నిజమే ప్రభూ! అదొక విషప్రాణి, చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు. కాని ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు. అందుకే దాన్ని చంపేశాను.

అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షిం చండి" అని వినయంగా చెప్పాడు రామయ్య "పాము ప్రమాదకరమైనది. సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటికి రాకుండా నీ పామును నువ్వ జాగ్రత్తగా కాపాడు కోవాల్సింది" అంటూ మర్యాదరామన్న సోమయ్యకి సర్దిచెప్పబోయాడు. మర్యాదరామన్న మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా "కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీ ందే. నేరస్తులను మీరు శిక్షిం చకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చుపెరిగిపోతాయి. నేను ఇతణ్ణి వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను" అన్నాడు అవేశంగా సోమయ్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాదరామన్నకు ఒక ఆలోచన తట్టింది. "నీ పామును రామయ్య ఎలా చంపాడు?" అని అడిగాడు రామన్న "ఎలా చెప్పమంటారు? దాని తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు." అని చెప్పాడు సోమన్న 'సరే, నువ్వ కూడా అలాగే చంపు. అతని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిర గిరా నెలకేసి కొట్ట' అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. "మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు" అన్నాడు.
అప్పుడు న్యాయాధికారి శాంతంగా "ఔను నిజమే. మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం. కాబట్టి నువ్వ § ఫిర్యాదును వెనుకకు తీసుకుని ఇంటికి వెళ్ళిపో" అని తీర్చు చెప్పాడు. మర్యాదరామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్ప తెలుసుకుని తల వంచుకుని ఇంటికి వెళ్లిపోయాడు సోమయ్య.

Friday, 31 July 2015

హ్యాపీ బుద్ధా..... లాఫింగ్‌ బుద్ధా......

Laughing Buddha


గుమ్మడికాయలా గుండ్రటి తలకాయ.. బానలాంటి పెద్ద బొజ్జ.. మనసారా నవ్వుతూ కనిపించే ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు హ్యాపీ బుద్ధా, లాఫింగ్‌ బుద్ధా, బుదాయ్‌గా చాలా ఇళ్లలో ఈ వింత రూపం కనిపిస్తూనే ఉంటుంది.

ఈ నిండుమనిషి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడని చెబుతుంటారు భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన.. పిల్లలు ఏది అడిగినా జోలెలో నుంచి తీసిచ్చేవాడట ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే.. ఆ రోజంతా హాయిగా గడిచిపోయేదట జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా భావించి పూజించేవారు థాయ్‌లాండ్‌లోనూ బుదాయ్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది ఇక మన దేశంలోనూ లాఫింగ్‌ బుద్ధను సాక్ష్యాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు ఈ నవ్వే దైవం విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉండవని విశ్వసిస్తారు అందుకే శుభకార్యాలకు లాఫింగ్‌ బుద్ధుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా మారింది అయితే విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో.. ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నిల్చుంటే ఆరోగ్యం..

రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుదాయ్‌ ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు  ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందట అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదని చెబుతున్నారు బుదాయ్‌ ఫాలోవర్స్‌  ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉంచవచ్చు.

సువర్ణావకాశం..
బంగారు నాణేల మీద తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. కాసులపై కొలువుదీరిన హ్యాపీ బుద్ధాను వాయవ్య దిశలో.. ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. బంగారు రంగులో నిగనిగలాడే బుదాయ్‌ ప్రతిమ నెగెటివ్‌ సిగ్నల్స్‌ను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు. వాయవ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉంటే.. అప్పుడు ఈ ప్రతిమను ఆగ్నేయ దిశలో ఉంచితే మేలు.

విన్స్‌ ద కెరీర్‌..
డ్రాగన్‌ టార్టాయి్‌సపై దర్జాగా కూర్చున్న హ్యాపీ బుద్ధా కెరీర్‌లో విశేషమైన మార్పులకు నాంది పలుకుతాడట. ఆదాయ మార్గాలనూ అమాంతంగా పెంచేస్తాడట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉంచాలి.

పిల్లలకు పెన్నిధి..

చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే హ్యాపీ బుద్ధా ప్రతిమ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. పిల్లల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందట. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

జ్ఞాన ప్రదాత..
క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. తద్వారా వారి తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయని భావిస్తారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.

Thursday, 16 July 2015

రంగు వెలిసిన ఏనుగు

రంగు వెలిసిన ఏనుగు












అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది  కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు ఇంతలో వర్షం మొదలయ్యింది చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు.

ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

నీ మనసే నీకు శత్రువు

మన మనస్సే మనకి శత్రువు లోకంలో శత్రుత్వం లేదు , శత్రువు లేడు, మరి ఉన్న శత్రువులు ఎక్కడినుండి వచ్చారు నీ మనసే నీకు శత్రువు దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది.

ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు ఊ అంటే కోపం, ఆ అంటే కోపం ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు పాపం ఈవిడ అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం అని తెగ బాధ పడిపోతుంది ఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది జరిగిందంతా చెప్పింది.

ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది దానికి సమధానంగా స్వామీజీ బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా అన్నాడు ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని సచ్చినోడా నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది.

వెంటనే స్వామీజీ నవ్వుతూ ఆగమ్మా ఆగు ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు నేను
దూషించాననే కదా అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు నేను వాడిన బాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం అంతే తప్ప మరొకటి కాదు ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు అని చెప్పి వెళ్ళిపోయాడు.

స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు.